HomeMovie News Teluguషకీలా సినిమాలో అంత 'పవర్‌' ఉంటుందా?

షకీలా సినిమాలో అంత ‘పవర్‌’ ఉంటుందా?

‘షకీలా’ ఈ పేరుకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. మలయాళంలో ‘సి’ గ్రేడ్‌ సెక్స్‌ సినిమాల్లో నటించింది షకీలా. అలాగే పలు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. షకీలా తెరపై కనిపిస్తే చాలు ముసలాడు కూడా లేచి గెంతులేస్తాడు. అంత పాపులర్‌ షకీలా అంటే. మలయాళంలో సూపర్‌స్టార్స్‌ అయిన మోహన్‌లాల్‌, మమ్ముట్టి వంటి స్టార్‌ హీరోస్‌కి తన బూతు సినిమాలతో గట్టి పోటీ ఇచ్చింది షకీలా. ఇప్పుడీ షకీలా మీద ఓ సినిమా చేయబోతున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ రిచా చద్దా ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కబోతోంది.

షకీలాకి ఉన్న క్రేజ్‌తో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ తదితర భాషల్లో ఈ సినిమాని విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్‌ ఉంది. అయితే షకీలా అంటే అందరికీ ఓ అభిప్రాయం ఉంది. అయితే తాజాగా తెరక్కెబోయే షకీలా చిత్రంలో ‘షకీలా’ పాత్రని చాలా పవర్‌ఫుల్‌గా చూపించనున్నారట. అదేంటి షకీలా పాత్రని పవర్‌ఫుల్‌గా చూపించడమేంటని అనుకునేరు. అవును ఈ తరహా సినిమాల్లో ‘పవర్‌’ అనే మాటకి తావుండదనే అభిప్రాయాలు రావడం సహజమే.

అయితే గతంలో ఐటెం గాళ్‌ సిల్క్‌ స్మిత జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన ‘డర్టీ పిక్చర్‌’ సినిమా గుర్తుంది కదా. ఆ సినిమా తొలుత ఎన్నో వివాదాలకు కేంద్రబిందువు అయినప్పటికీ, ఆ తర్వాత ఆ సినిమాలోని లీడ్‌ రోల్‌ పోషించిన విద్యాబాలన్‌ క్యారెక్టర్‌కి సంబంధించిన ఎమోషన్స్‌ జనానికి బాగా కనెక్ట్‌ అయ్యాయి. అలాగే ఈ సినిమా విషయంలో కూడా ఇంకో యాంగిల్‌ నుండి అలాంటి ఎమోషన్‌ ‘టచ్‌’ ఏమైనా ఇచ్చి, వర్కవుట్‌ అయ్యేలా చేస్తారేమో చూడాలి మరి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular