HomeMovie News Teluguసూపర్‌స్టార్‌ కాంపౌండ్‌ నుండి ఇంకో హీరో?

సూపర్‌స్టార్‌ కాంపౌండ్‌ నుండి ఇంకో హీరో?

సూపర్‌ స్టార్‌ కృష్ణ తర్వాత, మహేష్‌బాబు ఆ లెగసీని నిలబెడుతూ, ఆయన తర్వాత టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నారు. గతంలో సూపర్‌ స్టార్‌ కృష్ణ తనయుడు, మహేష్‌కి అన్నయ్య అయిన రమేష్‌బాబు కూడా హీరోగా పలు చిత్రాల్లో నటించారు. కానీ అంతగా సక్సెస్‌ కాలేదు. తర్వాత సినిమాలకు దూరమయ్యారాయన. సూపర్‌స్టార్‌ తనయ మంజుల హీరోయిన్‌గా ప్రయత్నిస్తే, అభిమానుల నుండి వచ్చిన ఒత్తిడి కారణంగా చిన్న చిన్న క్యారెక్టర్స్‌కే పరిమితమై, తర్వాత నిర్మాతగా, ప్రస్తుతం దర్శకురాలిగా సత్తా చాటుతున్నారు.

ఇకపోతే, ఈ ఫ్యామిలీ నుండి వచ్చి హీరోగా తనదైన శైలిలో చిత్రాలు చేసుకుంటూ పోతున్నాడు ఘట్టమనేని అల్లుడు సుధీర్‌బాబు.ఇప్పుడు కొత్తగా మరో ఘట్టమనేని వారసుడు హీరోగా తెరంగేట్రం చేయడానికి సిద్దంగా ఉన్నాడు. ఆయన ఇంకెవరో కాదు, రమేష్‌బాబు తనయుడు జయకృష్ణ. జయకృష్ణకు చిన్నతనం నుండే బాబాయ్‌లాగా సూపర్‌స్టార్‌ అవ్వాలని కోరికట. ఆ కోరికకు తగ్గట్లుగానే కుటుం బ సభ్యుల ప్రోత్సాహం తోడై, ఇప్పటికే నటనలో శిక్షణ పొందుతున్నాడట కూడా. పవన్‌ కళ్యాణ్‌, చరణ్‌, ప్రబాస్‌, వరుణ్‌, ధరమ్‌.. ఇలా టాలీవుడ్‌లోని ప్రముఖ హీరోలందరికీ నటనలో ప్రత్యేక శిక్షణ ఇచ్చిన సత్యానంద్‌ దగ్గరే మన జయకృష్ణ కూడా శిక్షణ తీసుకుంటున్నాడు.

డాన్సులు, ఫైట్స్‌ ఇతరత్రా యాక్టింగ్‌ స్కిల్స్‌లో ఆరితేరాడట ఆల్రెడీ. ఇక తెరంగేట్రమే తరువాయి. అందుకు త్వరలోనే రంగం సిధ్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. అన్నట్లు ఈ జయకృష్ణ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఆల్రెడీ నటించేశాడు. మహేష్‌బాబు నటించిన ‘నిజం’ సినిమాలో చిన్నప్పటి మహేష్‌బాబుగా నటించింది ఈ జయకృష్ణే. చూడాలి మరి హీరోగా ఏ సినిమాతో రానున్నాడో ఈ ఘట్టమనేని వారసుడు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular