HomeMovie News Teluguశ్రీదేవి కూతురు జాన్వీ పరిస్థితేంటి?

శ్రీదేవి కూతురు జాన్వీ పరిస్థితేంటి?

అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణంతో ఆమె కూతురు జాన్వీ కపూర్‌ పరిస్థితి అగమ్య గోచరమైపోయింది. కూతురును హీరోయిన్‌గా ఓ స్థాయిలో నిలబెట్టేందుకు అనుక్షణం శ్రీదేవి తపన పడుతుండేది. నటనలో బయటి శిక్షణ ఇప్పించినా, కానీ ఇంట్లో తన శిక్షణలో జాన్వీ నేర్చుకున్నదే ఎక్కువ. 

అలా తల్లిగానే కాకుండా ఓ టీచర్‌గా జాన్వీకి సూచనలిస్తుండేది శ్రీదేవి. డాన్సుల్లో జాన్వీకి శ్రీదేవి ప్రత్యేక శిక్షణ ఇచ్చేది. తన ఆరోగ్యాన్ని, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి కారణం తన కూతురే. కూతురుకి నడక దగ్గర నుండి, డాన్సింగ్‌ స్టైల్‌ అంతా దగ్గరుండి శ్రీదేవే శిక్షణ ఇచ్చేదట. అలాంటిది ఇప్పుడు శ్రీదేవి లేదు. ఇక రాదు. కూతురుని హీరోయిన్‌గా చూడాలన్న కోరిక కూడా తీరకుండానే ఆమె అనంత లోకాలకు వెళ్లిపోయింది. ఇప్పుడు జాన్వీ పరిస్థితి ఏంటి? 

తల్లిగా తనకున్న అనుభవంతో ఇంకా ఎంతో నేర్పించాల్సి ఉంది జాన్వీకి. హీరోయిన్‌గా మీడియాని ఫేస్‌ చేయడం ఓ బ్రహ్మ విద్య. ఇంకా అందులో జాన్వీకి అనుభవం లేదు. ఇలాంటి విషయాల్లో జాన్వీకి ఇప్పుడు దిశా నిర్దేశం చేసేదెవరు? అందుకే శ్రీదేవి మరణంతో జాన్వీ ఎక్కువ షాక్‌లో.కి వెళ్లిపోయింది. ఓ పక్క తల్లి చనిపోయిందన్న బాధ. హీరోయిన్‌గా తాను భవిష్యత్తులో ఏ స్థాయిలో నిలబడగలనన్న ఆందోళన, భయం ఇంకో వైపు ఆమెను డిప్రెషన్‌లోకి నెట్టేస్తున్నాయి. 

అయినా కానీ ఇప్పుడు ఆమె ముందున్న లక్ష్యం తల్లి కోరికను నెరవేర్చడం. ప్రస్తుతం జాన్వీ కపూర్‌ ‘ధడక్‌’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. తొలి సినిమాతో జాన్వీ తనను తాను హీరోయిన్‌గా ఎలా నిరూపించుకుంటుందో! హీరోయిన్‌గా నిలబడాలన్న తల్లి కోరికను తీర్చడం అనే ఈ పెద్ద బాధ్యతను ఏ స్థాయిలో నిలబెట్టుకుంటుందో చూడాలి మరి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular