HomeMovie News Teluguదేశీ బ్యూటీ హాలీవుడ్‌ 'హాట్‌' షో

దేశీ బ్యూటీ హాలీవుడ్‌ ‘హాట్‌’ షో

ఎవరేమన్నా అనుకోండి, నా హాట్‌ అప్పీల్‌ తగ్గదు సరికదా ఇంకా పెరుగుతుందని తెగేసి చెప్పడమే కాదు చేసి చూపించేస్తోంది అందాల భామ ప్రియాంకా చోప్రా. బాలీవుడ్‌లో ఉన్నప్పుడే ఈ బ్యూటీ హాట్‌నెస్‌కి ఆకాశమే హద్దు అనేలా ఎక్స్‌పోజింగ్‌తో కేక పెట్టించింది. హాలీవుడ్‌కి వెళ్ళాక తగ్గుతుందా? టూ పీస్‌ బికినీలు ఆమెకి సర్వసాధారణమైపోయాయి. హాలీవుడ్‌ టచ్‌తో అల్ట్రా స్టైలిష్‌ లుక్‌ని ఆపాదించుకోవడానికి ప్రియాంకా చోప్రా చేస్తోన్న ‘గ్లామరస్‌ షో’ ఎప్పటికప్పుడు హాట్‌ హాట్‌గా చర్చనీయాంశమవుతూనే ఉంది. 

తాజాగా ఈ బ్యూటీ అల్ట్రా స్టైలిష్‌ లుక్‌ హాట్‌ టాపిక్‌ అవడమే కాదు, సోషల్‌ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా ట్రాలింగ్‌ జరగడానికీ కారణమయ్యింది. ట్రాలర్స్‌ని ఉద్దేశించి ఇంకోసారి ప్రియాంకా చోప్రా స్పందించింది. తన గ్లామర్‌ని ఎక్కువగా ఎంజాయ్‌ చేసేవారే, తనను ట్రాల్‌ చేస్తుంటారంటూ కౌంటర్‌ ఇచ్చింది. రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లానే బిహేవ్‌ చేయాలంటూ ప్రియాంక చెప్పిందండోయ్‌. ‘క్వాంటికో’ కొత్త సిరీస్‌తో బిజీగా ఉన్న ప్రియాంకా చోప్రా, కొన్ని హాలీవుడ్‌ ప్రాజెక్ట్స్‌ని బుట్టలో వేసుకునేందుకూ ప్రయత్నిస్తోంది. అవకాశాల సంగతెలా ఉన్నా ఈ బ్యూటీకి హాలీవుడ్‌లో మంచి గుర్తింపే దక్కుతుంది. 

హాలీవుడ్‌ పార్టీస్‌, అవార్డ్స్‌ ఈవెంట్స్‌లలో ప్రియాంక సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. గతంలో ఐశ్వర్యారాయ్‌ కూడా ఇలాగే హాలీవుడ్‌లో సందడి చేసినా, ఆమెను మించి ప్రియాంక పేరు తెచ్చుకుంటోంది. దీపికా పడుకొనే కూడా హాలీవుడ్‌ ట్రై చేసిందిగానీ, ప్రియాంక ముందు దీపిక పప్పులుడకలేదని చెప్పొచ్చు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular