HomeMovie News Teluguఅనసూయ హాట్‌నెస్‌ మరీ అంతలానా?

అనసూయ హాట్‌నెస్‌ మరీ అంతలానా?

బుల్లితెరపై హాట్‌ హాట్‌ అందాలను ఆరబోస్తూ, వెండితెరపై బిజీగా గడుపుతోన్న ముద్దుగుమ్మ అనసూయ. బుల్లితెరపై బిజీగా ఉంటూనే సిల్వర్‌ స్క్రీన్‌పై క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటోంది. తాజాగా అనసూయ నటిస్తున్న సినిమా ‘గాయత్రి’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మోహన్‌బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విష్ణు, శ్రియ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

లేటెస్టుగా జరిగిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌లో హాట్‌ బ్యూటీ అనసూయ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఎంతో అనుభవం ఉన్న హీరోయిన్‌ శ్రియ గ్లామర్‌నే అనసూయ డామినేట్‌ చేసేసింది ఈ ఫంక్షన్‌లో. గతంలో మంచు ఫ్యామిలీ సినిమా ఫంక్షన్స్‌కి, చాలా వాటికి తాను యాంకరింగ్‌ చేశాననీ చెబుతూ, మంచు వారి ఆస్థాన యాంకర్‌గా తనను తాను అభివర్ణించుకుంది ముద్దుగుమ్మ అనసూయ. స్టేజ్‌పై అనసూయ మాటలకు స్టేజ్‌ కింద నుండి మంచు విష్ణు సరదా సరదా సెటైర్లు వేశారు. అలా అనసూయ స్పీచ్‌ ఆకట్టుకుంది. 

ఇక గ్లామర్‌ విషయానికి వస్తే, ఈ ఫంక్షన్‌ మొత్తానికి అనసూయ గ్లామరే హైలైట్‌ అని చెప్పాలి. క్లీవేజ్‌ లాంగ్‌ ఫ్రాక్‌లో అక్కడక్కడా కొంచెం విచ్చలవిడిగానే అందాల ప్రదర్శన చేసేసిందీ ముద్దుగుమ్మ. దాంతో సోషల్‌ మీడియాలో అమ్మడి అన్‌లిమెటెడ్‌ హాట్‌నెస్‌కి కొన్ని చిలిపి చిలిపి సెటైర్లు కూడా పడ్డాయి. మరో పక్క వయసుతో సంబంధం లేకుండా హాట్‌నెస్‌లో తనకి తానే సాటి అనిపించుకుంటున్న అనసూయ గ్లామర్‌ కెవ్వుకేక అనే వాళ్లు కూడా లేకపోలేదు. 

ఈ సినిమా సంగతి ఇలా ఉండగా, సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రామ్‌ చరణ్‌ మూవీ ‘రంగస్థలం’లోనూ అనసూయ కీలక పాత్రలో నటిస్తుంది. మార్చిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular