HomeMovie News Teluguసంక్రాంతికి కీర్తి సురేష్‌ డబుల్‌ ధమాకా

సంక్రాంతికి కీర్తి సురేష్‌ డబుల్‌ ధమాకా

‘నేను శైలజ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై, టాలెంటెడ్‌ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకుని, తక్కువ కాలంలోనే క్రేజీ ప్రాజెక్టులు సొంతం చేసుకుంటున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. కొత్త సంవత్సరంలో ఈ ముద్దుగుమ్మకి తిరుగే లేదని చెప్పాలి. ఏడాది మొదట్లోనే తెలుగులో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. 

‘అజ్ఞాతవాసి’ సినిమాలో పవన్‌కి మరదలి పాత్రలో కీర్తి సురేష్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్‌ మరో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇదిలా ఉండగా, తమిళంలో ఈ ముద్దుగుమ్మ జ్ఞాన్‌వేల్‌ రాజా నిర్మాణంలో ఓ సినిమాలో నటిస్తోంది. సూర్య కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ ఓ బ్రాహ్మణ యువతి పాత్రలో నటిస్తోందట. ఈ పాత్ర ఆమెకు చాలా బాగా నచ్చిందట. అన్నింటికీ మించి, తమిళంలో తన ఫేవరేట్‌ హీరో సూర్య సరసన నటిస్తుంది ఈ చిత్రంలో కీర్తి సురేష్‌. 

సినీ ఫ్యామిలీ నుండి వచ్చిన కీర్తి సురేష్‌, చిన్నప్పుడే అనుకుందట. హీరోయిన్‌ అయ్యాక సూర్యతో ఒక్క సినిమాలోనైనా నటించాలని. అప్పుడు అదో డ్రీమ్‌ అట ఈ ముద్దుగుమ్మకి. ఆ డ్రీమ్‌ ఈ ఏడాదిలో నెరవేరబోతోందని మురిసిపోతోంది. ఈ సంక్రాంతికే ఆ సినిమా కూడా విడుదల కాబోతోంది. ‘తానా సేంద కుట్టం’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సంక్రాంతి ఎంతో ఎంతో స్పెషల్‌ అంటోంది అందుకే కీర్తి సురేష్‌. ఇటు తెలుగులో పవర్‌ స్టార్‌తో, అటు తమిళంలో తన డ్రీమ్‌ స్టార్‌తో నటిస్తున్న రెండు చిత్రాలూ ఒకేసారి విడుదల అవుతుండడంతో కీర్తి సురేష్‌ ఆనందానికి అస్సలు అవధుల్లేవు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular