HomeMovie News Teluguసోషల్‌ మీడియాని ఊపేస్తోన్న 'కొడకా'

సోషల్‌ మీడియాని ఊపేస్తోన్న ‘కొడకా’

పవన్‌కళ్యాణ్‌ నుంచి కొత్త సినిమా ఎప్పుడొచ్చినా, ఆ సినిమాపై అంచనాలకు ఆకాశమే హద్దు అనేలా ఉంటుంది. ఇప్పుడూ అదే జరుగుతోంది. ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’, ‘కాటమరాయడు’ కొంత నిరాశపరిచినా, పవన్‌ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న ‘అజ్ఞాతవాసి’ టాలీవుడ్‌ గత రికార్డుల్ని తిరగరాసేస్తుందన్న నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. 

ట్రేడ్‌ వర్గాలు కూడా, 2018వ సంవత్సరానికి తొలి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా ‘అజ్ఞాతవాసి’ ఉండబోతోందని అంచనా వేస్తుండడం గమనించదగ్గ విషయం. లేటెస్ట్‌గా న్యూ ఇయర్‌ కానుకగా ఈ ‘అజ్ఞాతవాసి’ సినిమా నుంచి ‘కొడకా కోటేశ్వరరావు’ పాటని విడుదల చేశారు. ఈ ఒక్క పాటతో ఈక్వేషన్స్‌ ఇంకా మారిపోయాయి. ఫుల్‌ మాస్‌ సాంగ్‌ ఇది. ఆఫీస్‌ సెటప్‌ (సినిమాలో పవన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా కనిపించబోతున్నాడు) ఈ పాటకోసం క్రియేట్‌ చేసినట్లు కనిపిస్తోంది. పవన్‌ ఫుల్‌ జోష్‌తో పాట పాడుతోంటే, అంతకు మించిన హుషారుతో అనిరుధ్‌ మ్యూజిక్‌ సాగుతోంది. 

భాస్కరభట్ల రవికుమార్‌ లిరిక్స్‌ పాటకు ఎక్స్‌ట్రా గ్లామర్‌ని ఇచ్చాయి. పాటలోని ప్రతి లైన్‌ వినేవారిలో జోష్‌ నింపుతోంది. ‘కాటమరాయుడా కదిరీ నరసింహుడా’ అంటూ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పాటందుకున్న పవన్‌, అంతకన్నా జోష్‌తో ‘కొడకా కోటేశ్వరరావు’ అనే పాటని ఆలపించడం జరిగింది. ఇప్పుడీ పాట సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఎంతగా వైరల్‌ అయ్యిందంటే, సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాట షేరింగ్స్‌ రూపంలో కనిపిస్తోంది. బయట కూడా ఎక్కడ విన్నా ఇదే పాట మార్మోగుతోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular