HomeMovie News Teluguనాని క్రియేటివిటీ అదిరింది

నాని క్రియేటివిటీ అదిరింది

నిర్మాతగా మారాక నేచురల్‌ స్టార్‌ నానిలో క్రియేటివిటీ అనూహ్యంగా పెరిగింది. ‘అ’ సినిమా నాని సమర్పణలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌ ‘అ’ – ఇంగ్లీష్‌లో రాస్తే ‘ఎడబ్ల్యుఇ’. ఈ ఇంగ్లీష్‌ అక్షరాల్ని ‘అ’ సినిమాలో నటిస్తున్న నటీనటులందరి పేర్లలో కనిపించేలా సోషల్‌ మీడియాలో ప్రమోట్‌ చేస్తున్నారు. 

నాని పేరు ఇంగ్లీష్‌లో రాస్తే ఎన్‌ఎఎన్‌ఐ అవుతుంది. కానీ ‘అ’ కోసం ‘ఎన్‌ఎడబ్ల్యుఇఎన్‌ఐ’ గా మార్చారు. అవసరాల శ్రీనివాస్‌, రెజీనా, ఈషా, నిత్యామీనన్‌ తదితర నటీనటులందరికీ ఇలాగే స్పెల్లింగ్స్‌ మార్చేశారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌ అంశం. ఇది పూర్తిగా నాని క్రియేటివిటీనే. ఎందుకంటే నాని సినిమా ‘ఎంసీఏ’ టైటిల్‌ కూడా అలా డిఫరెంట్‌గా వచ్చిందే. తెలుసు కదా. ‘ఎంసీఏ’ అంటే మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి అని. అలాగే క్రిస్‌మస్‌ శుభాకాంక్షలు చెబుతూ ‘ఎంసీఏ’ అని ఇంకోసారి సోషల్‌ మీడియాలో ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌ వేశాడు ఈ యంగ్‌ హీరో. 

ఇక్కడ ‘ఎంసీఏ’ అంటే అర్ధం ఏంటో తెలుసా? ‘మెరీ క్రిస్‌మస్‌ అందరికీ’. అదీ నాని క్రియేటివిటీ. తొలి రోజు టాక్‌ ఎలా ఉన్నా, ‘ఎంసీఏ’ సినిమా వసూళ్ల పరంగా బాక్సాఫీస్‌ దగ్గర ధమాకా విక్టరీ అందుకుంది. నేడు క్రిస్‌మస్‌ కావడంతో సినిమా వసూళ్లకు మరో ఛాన్స్‌ దక్కినట్లయ్యింది. 21 గురువారం సినిమా రిలీజైంది. 25 సోమవారం నేడు, క్రిస్‌మస్‌ కూడా. దాంతో ఈ రోజు ధియేటర్స్‌ అన్నీ ఫుల్‌ క్రౌడ్‌తో కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే రెండు హిట్లు కొట్టిన నాని తాజా హిట్‌తో మొత్తం మూడు హిట్‌ సినిమాల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ రకంగా నానికి 2017 వెరీ వెరీ స్పెషల్‌.

You May Like This
- Advertisment -spot_img

Most Popular