HomeMovie News Teluguసుమంత్ - కీర్తి విడిపోవటానికి అసలు కారణం ఇదే..!

సుమంత్ – కీర్తి విడిపోవటానికి అసలు కారణం ఇదే..!

హీరో సుమంత్ – హీరోయిన్ కీర్తి రెడ్డి ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి వివాహం ఎక్కువ కాలం నిలబడలేకపోయింది, దీనితో ఇరువురు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.

అయితే వారు విడిపోవడానికి అసలు కారణాలు ఏంటో ఇప్పటివరకు తెలియకపోవడం, అలాగే సుమంత్ కూడా ఎక్కడా ఈ అంశం గురించిన ప్రస్తావన తీసుకురాలేదు. కాని సుమంత్ తాజా చిత్రం ‘మళ్ళీ రావా’ హిట్ అవ్వడం తో ఆ చిత్రం తాలుకా ప్రచార కార్యక్రమాలలో భాగంగా వివిధ షోలలో పాల్గొనడం జరిగింది.

ఈ షోలలోనే ఆయనకి కీర్తి గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇంతకీ వారు విడిపోవడానికి కారణం – ఒకరికి ఒకరు సెట్ అవ్వకపోవడమే అని అంతకు మించి ఏమి లేదు అని చెప్పాడు. అయితే తాను ఇప్పటికీ కీర్తి తో మాట్లాడుతుంటాను అని, ఆమె పెళ్లి చేసుకుని ఇద్దరి పిల్లలతో చాలా సంతోషంగా ఉంది అని చెప్పడంతో వీరు విడిపోవడానికి తప్పుడు ప్రచారం అవుతున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని తేలిపోయాయి.

దీంతో కీర్తి – సుమంత్ ల ఎపిసోడ్ పైన అనుమానాలకి ఫుల్ స్టాప్ పడింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular