HomeMovie News Teluguబాబాయ్‌ లుక్స్‌ అదిరిపోయాయ్‌ - చరణ్‌

బాబాయ్‌ లుక్స్‌ అదిరిపోయాయ్‌ – చరణ్‌

‘అజ్ఞాతవాసి’ టీజర్‌కి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఫిదా అయిపోయాడట. బాబాయ్‌ లుక్స్‌ అదిరిపోయాయ్‌ టీజర్‌లో అంటున్నాడు రామ్‌ చరణ్‌. టీజర్‌ తనకి చాలా బాగా నచ్చేసిందట. టీజర్‌ స్టార్టింగ్‌ నుండీ ఎండింగ్‌ వరకూ మంచి టెంపోతో సాగింది అని తెగ పొగిడేస్తున్నాడు బాబాయ్‌ని అబ్బాయ్‌ రామ్‌ చరణ్‌. 

ఇదిలా ఉండగా ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ రేపు జరగబోతోంది. ఈ ఆడియో ఫంక్షన్‌కి ఛీఫ్‌ గెస్ట్‌గా ఎవరొస్తారనే విషయంపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మొదట్లో మెగాస్టార్‌ చిరంజీవి గెస్ట్‌గా వస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’తో బిజీగా ఉన్న కారణంగా ఆయన రావట్లేదనీ తెలిసింది. అయితే ఆ తర్వాత ఈ ఆడియో ఫంక్షన్‌కి ఎన్టీఆర్‌ వస్తున్నాడంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఎన్టీఆర్‌, వెంకటేష్‌, రామ్‌చరణ్‌ ఈ ముగ్గురూ రానున్నారంటూ ప్రచారం జరుగుతోంది. 

ఇవన్నీ ఇలా ఉండగా తాజా అప్‌డేట్‌ ప్రకారం ఈ ఆడియో ఫంక్షన్‌ని చాలా సింపుల్‌గా ఏ హడావిడి లేకుండా జరపనున్నారనీ తెలుస్తోంది. కేవలం చిత్ర యూనిట్‌ మాత్రమే హాజరు కానుందట. అలాగే ఈ ఆడియో ఫంక్షన్‌లోనే ట్రైలర్‌ కూడా విడుదల కానుందని అన్నారు. అయితే అది కూడా పోస్ట్‌ పోనే అయ్యేలా ఉందనీ మరో పక్క టాక్‌ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతో తెలీదు కానీ, మొత్తానికి ఈ ఆడియో ఫంక్షన్‌ ఎలా జరగనుంది? ఎవరెవరు రానున్నారు అనే విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ అయితే లేదు. 

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అనూ ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్‌ నటి కుష్బూ కీలక పాత్రలో నటిస్తోంది. వెంకటేష్‌ గెస్ట్‌ రోల్‌ పోషించారు. అనిరుధ్‌ మ్యూజిక్‌నందించాడు. జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular