HomeMovie News Teluguరాజశేఖర్‌ ఎన్నాళ్లకెన్నాళ్లకో!

రాజశేఖర్‌ ఎన్నాళ్లకెన్నాళ్లకో!

ఎన్నాళ్ల నుండో ఎదురు చూస్తున్నాడు రాజశేఖర్‌ హిట్‌ కోసం. ఆ హిట్‌ ఇప్పుడు దక్కింది. ‘పీఎస్‌వీ గరుడవేగ’ రూపంలో. అందరూ ఈ సినిమాని అభినందిస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్‌ రాజమౌళి సహా అంతా ఈ సినిమాకి అభినందనలు తెలిపారు. అన్ని వర్గాల నుండీ ‘గరుడవేగ’ సినిమాకి ప్రశంసలు దక్కుతున్నాయి. అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్‌ని వ్యత్యించేశారు ఈ సినిమాకి. ఆ రకంగా చిత్ర యూనిట్‌ చాలా పెద్ద రిస్క్‌ చేసినట్లే. అయితే అంత రిస్క్‌ చేసినందుకు రాజశేఖర్‌కీ, ఈ సినిమాని ఇంత బాగా తెరకెక్కించిన డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారుకీ మంచి పేరొచ్చింది.

కష్టపడినందుకు సరైన ఫలితం దక్కింది ఈ సినిమాతో. సినిమా విడుదలకి ఒక్క రోజు ముందు కూడా రాజశేఖర్‌తో ఇంత రిస్క్‌ అవసరమా అన్న మాటలు వినిపించాయి. కానీ సినిమా చూశాక అలాంటి మాటలన్నీ పటాపంచలైపోయాయి. అంత బాగా ఆకట్టుకుంటోంది ఈ సినిమా. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరరకెక్కింది ఈ సినిమా. పూజా కుమార్‌ హీరోయిన్‌గా నటించింది. ప్రతీ సన్నివేశం అద్భుతంగా ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించారు డైరెక్టర్‌ ప్రవీణ్‌. రాజశేఖర్‌ వంటి హీరోకి ఇన్నాళ్ల గ్యాప్‌ తర్వాత ఇంత మంచి సినిమాతో హిట్‌ దక్కింది.

రాజశేఖర్‌ లుక్‌, చాలా బాగుంది. ఎప్పటిలాగే వెరీ వెరీ హ్యాండ్‌సమ్‌ లుక్స్‌తో, అదిరిపోయే పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు రాజశేఖర్‌. యాక్షన్‌ ఘట్టాలు అత్యంత కీలకంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ సినిమాలోని సన్నీలియోన్‌ ఐటెం సాంగ్‌ అయితే ఊపు ఊపేస్తోంది. నిజంగానే ఈ సాంగ్‌ సినిమాకి స్పెషల్‌ అట్రాక్షన్‌ అయ్యింది. ఇకపై రాజశేఖర్‌ హీరోగా భారీ బడ్జెట్‌ మూవీస్‌నీ తెరకెక్కించొచ్చుననే విషయం ఈ సినిమాతో ప్రూవ్‌ అయ్యింది. దటీజ్‌ రాజశేఖర్‌.

You May Like This
- Advertisment -spot_img

Most Popular