HomeMovie News Teluguమెరుపుతీగలా చందమామ!

మెరుపుతీగలా చందమామ!

చందమామ అందం అంటే కాజల్‌దే. చందమామకైనా మచ్చుంటుంది కానీ కాజల్‌ అందానికి మచ్చే లేదు. తొలి సినిమా నుండీ ఇప్పటిదాకా ఫిట్‌నెస్‌ విషయంలోనూ కాజల్‌ అగర్వాల్‌ ఎప్పుడూ రాజీ పడలేదు. ‘చందమామ’ సినిమా ఆమెకు మంచి గుర్తింపునిచ్చింది. ‘మగధీర’ సినిమాతో కాజల్‌ కెరీర్‌ ఓ రేంజ్‌లో వెలిగిపోయింది. అప్పట్నుంచీ ఇక కాజల్‌ వెనక్కి తిరిగి చూడలేదు. వరుస అవకాశాలతో, వరుస సక్సెస్‌లతో దూస్కెళ్లిపోతోంది. ఇక ఫిట్‌నెస్‌ విషయానికి వస్తే కాజల్‌ని కొట్టేవారెవరూ లేరనే చెప్పాలి. అప్పుడప్పుడూ కొంచెం బొద్దుగా మారినా అందంగానే కనిపించింది తప్ప స్లిమ్‌ అవ్వాలి కాజల్‌ అనే మాట అన్పించుకోలేదు.

అలాగే షేప్‌ అవుట్‌ అనే మాట కూడా కాజల్‌ విషయంలో ఇంతవరకూ వినలేదు. అలాంటిది ఇప్పుడు ‘క్వీన్‌’ సినిమా కోసం ఇంకాస్త స్లిమ్‌గా హాట్‌గా తయారైంది. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఫోటోని కాజల్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌ నటించిన ‘క్వీన్‌’ సినిమా ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. కాగా తమిళంలో హీరోయిన్‌గా కాజల్‌ నటిస్తుండగా, తెలుగులో క్వీన్‌ పాత్రని తమన్నా పోషిస్తోంది. మలయాళంలో మంజిమా మోహన్‌ నటిస్తోంది.

తెలుగులో ‘క్వీన్‌’ టైటిల్‌తో తెరకెక్కుతుండగా, తమిళంలో ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ పేరుతో తెరకెక్కుతోంది ఈ సినిమా. తమిళంలో ఈ సినిమాని రమేష్‌ అరవింద్‌ తెరకెక్కిస్తున్నారు. తెలుగులో నీలకంఠ తెరకెక్కిస్తున్నారు. చేతికి మెహందీతో ఉన్న ఫోటోని తమన్నా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. విమానంలో ఫోటో ఇది. చేతికి మెహందీ అందాలు విమానం విండో నుండి మేఘాల అందాలు కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్‌ ఫ్రాన్స్‌లో జరుగుతోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular