HomeMovie News Teluguశ్రీముఖీ మరీ అంత హాట్‌గానా!

శ్రీముఖీ మరీ అంత హాట్‌గానా!

బుల్లితెర హాటెస్ట్‌ యాంకర్స్‌లో ఒకరైన శ్రీముఖి హీరోయిన్‌గా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘గుడ్‌ బ్యాడ్‌ ఆగ్లీ’ టైటిల్‌తో ఈ సినిమా తెరకుక్కుతోంది. హర్షవర్ధన్‌ ఈ సినిమాకి దర్వకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్‌ని విడుదల చేసిన విధానం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. డైరెక్టర్స్‌ గురించి డిస్కర్షన్‌, రామ్‌గోపాల్‌ వర్మ ప్రస్థావన.. అప్‌ కమింగ్‌ డైరెక్టర్స్‌కి వర్మ ఎంత ఇన్సిప్రేషనో చెబుతూ ట్రైలర్‌ స్టార్ట్‌ అవుతుంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న శ్రీముఖి విషయానికి వస్తే, ఓ పల్లెటూరి అమ్మాయి క్యారెక్టర్‌లో శ్రీముఖి నటిస్తోంది.

చీరకట్టులో నిండైన బొట్టుతో కనిపిస్తోంది. కానీ ఆ కట్టులోనే చూపించాల్సిన హాట్‌నెస్‌ అంతా చూపించేస్తోంది శ్రీముఖి. మోడ్రన్‌ వేర్‌ కాకుండానే సో హాట్‌గా కనిపిస్తోంది. అసలే ఈ మధ్య బాగా బొద్దుగా తయారైంది శ్రీముఖి. సినిమా కోసం ఫిజిక్‌ని కాస్త షేప్‌ చేసినా కానీ ఇంకా బొద్దుగానే కనిపిస్తోంది. గతంలోనూ శ్రీముఖి పలు చిత్రాల్లో నటించింది. అయితే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మాత్రమే నటించింది. నాని హీరోగా తెరకెక్కిన ‘జెంటిల్‌మెన్‌’ సినిమా శ్రీముఖికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

ఆ తర్వాత శ్రీముఖి హీరోయిన్‌గా మారి, నటిస్తున్న సినిమా ఇదే. హీరోయిన్‌గా వచ్చిన ఛాన్స్‌తో ఫుల్‌గా హాట్‌ అప్పీల్‌ ఇచ్చేసింది ఈ భారీ అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి. హాట్‌నెస్‌ ఉన్నా సినిమాలో ఏదో విషయం ఉందనే అనిపిస్తోంది. అదేంటో తెరపైనే చూడాలి తప్పదు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular