HomeMovie News Teluguఅక్కినేని ఫార్ములా సక్సెస్‌ అయినట్లే!

అక్కినేని ఫార్ములా సక్సెస్‌ అయినట్లే!

తాజాగా ముద్దుగుమ్మ సమంత ‘రాజుగారి గది – 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుకున్నట్లుగానే ప్రేక్షకుల అంచనాలను అందుకుంది ఈ సినిమాతో సమంత. లా చదువుకున్న అమ్మాయి అమృత పాత్రలో సమంత నటన ఆకట్టుకుంటోంది. అలాగే దెయ్యం పాత్రలో సమంత తనలోని కొత్త టాలెంట్‌ని బయటికి తీసింది ఈ సినిమాతో. కొత్త జోనర్‌ మూవీ. అందులోనూ పెళ్లి తర్వాత వచ్చిన తొలి చిత్రం. అలాగే మామగారయ్యాక నాగార్జునతో కలిసి నటించిన తొలి చిత్రం.. ఇలా ఈ సినిమాతో సమంతకు చాలానే కొత్త కొత్త అనుభవాలున్నాయి.

ఇక సినిమా విషయానికి వస్తే, మామూలు సాదా సీదా హారర్‌ కామెడీ చిత్రం కాదిది. ఈ సినిమాతో ఓ మంచి మెసేజ్‌ని కూడా పాస్‌ చేశారు. మహిళల రక్షణ, అసలు జీవితం అంటే ఏమిటి? అనే అంశాలపై అవగాహన కలిగేలా ఉంది ఈ సినిమా. ప్రతీ ఒక్క అమ్మాయి, ప్రతీ మహిళ చూడదగ్గ సినిమా ఇది. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌, మనసుకు హత్తుకునే కథా, కథనాలు అన్నీ కుదిరాయి ఈ సినిమాకి. ఓంకార్‌ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా.

నాగార్జున మెంటలిస్ట్‌ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. అక్కినేని ఫ్యామిలీలోకి ఎంటర్‌ అయ్యాక, మామా, కోడళ్లు కలిసి పని చేసిన సినిమాగా ‘రాజుగారి గది – 2’ సినిమా నాగ్‌, శామ్‌లకి ఓ మంచి సినిమా అవుతుందనడంలో అతిశయోక్తి కాదు. ప్రస్తుతం సమంత ‘రంగస్థలమ్‌’ సినిమాలో నటిస్తోంది. రామ్‌చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా.

You May Like This
- Advertisment -spot_img

Most Popular