HomeMovie News Teluguసాయి పల్లవి సమ్‌థింగ్‌ డిఫరెంట్‌

సాయి పల్లవి సమ్‌థింగ్‌ డిఫరెంట్‌

‘ఫిదా’తో మంచి హిట్టు అందుకున్న ముద్దుగుమ్మ సాయి పల్లవితో చాలా జాగ్రత్తగా ఉండాలండోయ్‌. ఆమెతో కొంచెం కష్టమే. మరోలా అనుకోకండి కానీ, ఆమె యాటిట్యూడ్‌ విషయానికొస్తే చాలా గుడ్‌ క్వాలిటీస్‌ ఉన్నాయి ఆమెలో. ఇమేజ్‌ ఉంది కదా అని క్యాష్‌ చేసుకునే రకం కాదు ఈ ముద్దుగుమ్మ. సినిమాల్లో ఎక్స్‌పోజింగ్‌కి అవకాశం ఇవ్వనని ముందే చెప్పేసింది. అలాగే ఏ సినిమా పడితే ఆ సినిమాకీ ఒప్పుకోనంటోంది. తన క్యారెక్టర్‌ ఇంపార్టెన్స్‌ని బట్టే సినిమాలు ఒప్పుకుంటోంది.

అలాగే ముఖ్యంగా నటన కంటే చదువుకే ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తూ ఉంటుంది. డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ని అయ్యాను అని చాలా మంది అంటుంటారు. కానీ ఈ ముద్దుగుమ్మ అనుకోకుండా యాక్టర్‌ అయినా కానీ, తన డాక్టర్‌ చదువుకు మాత్రం ఏ అడ్డంకి రాకుండా చూసుకుంటానంటోంది. డాక్టర్‌ చదివే తీరతానంటోంది. సినిమాలు జస్ట్‌ ఓ రిలీఫ్‌. అంతేకానీ తన ఫ్యూచర్‌ మాత్రం డాక్టర్‌ అయ్యి పేదలకు సేవ చేయడమే అంటోంది. అందుకే సాయి పల్లవి యాటిట్యూడ్‌ని మెచ్చుకోకుండా ఉండలేపోతున్నారు.

మామూలుగా హీరోయిన్లు పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్స్‌ ఓపెనింగ్స్‌కి హాజరై, పబ్లిక్‌లోకి వచ్చి ఫ్యాన్స్‌లో తమకున్న ఇమేజ్‌ని మరింత రెట్టింపు చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం షాపింగ్‌ మాల్స్‌ ఓపెనింగ్స్‌కి రానని ఖచ్చితంగా చెప్పేసిందట. అయితే హాస్పిటల్స్‌, స్కూల్స్‌ ఓపెనింగ్స్‌కి అయితే వస్తుందట. అదీ సంగతి. అందుకే సాయి పల్లవి సమ్‌థింగ్‌ డిఫరెంట్‌. ప్రస్తుతం నానితో ‘ఎంసిఏ’ సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

You May Like This
- Advertisment -spot_img

Most Popular