HomeMovie News Teluguవావ్‌ కేథరీన్‌ అదరగొట్టేస్తోంది

వావ్‌ కేథరీన్‌ అదరగొట్టేస్తోంది

హాట్‌ బ్యూటీ కేథరీన్‌కి బిగ్‌ ఛాన్స్‌ ఇంతవరకూ దక్కలేదు. కానీ వస్తున్నవన్నీ సూపర్‌ ఛాన్స్‌లే అనకుండా ఉండలేము. అందుకే సెకండ్‌ హీరోయిన్‌గా అయినా కానీ సత్తా చాటేస్తోంది. దేనికైనా అదృష్టం కలిసి రావాలంటోంది ఈ ముద్దుగుమ్మ సోలో హీరోయిన్‌ మాటేంటి అని అడుగుతుంటే. అయినా కానీ సెకండ్‌ హీరోయిన్‌గా కేథరీన్‌కి ఆఫర్స్‌ క్యూ కడుతున్నాయి. అవి కూడా అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్రలే. అలాంటప్పుడు నేను సెకండ్‌ హీరోయిన్‌ అని ఎందుకు బాధపడాలి.

అలాగే సోలో హీరోయిన్‌ గా కన్నా తనకొస్తున్న సెకండ్‌ హీరోయిన్‌ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందంటోంది. గ్లామర్‌తో పాటు, నటనకి ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్‌ లభిస్తుండడం, తన అదృష్టం అంటోంది. అంతకన్నా ఇంకేం కావాలి ఓ నటికి అని ప్రశ్నిస్తోంది ఈ ముద్దుగుమ్మ. మొన్న వచ్చిన ‘సరైనోడు’ నుండి మొదలుకొని, నిన్న ‘గౌతమ్‌ నంద’ ఈ రోజు విడుదలైన ‘నేనే రాజు నేనే మంత్రి’, జయ జానకి నాయకా’ సినిమాల్లో కేథరీన్‌ అంద చందాలతో పాటు, మంచి నటనతోనూ ఆకట్టుకుంది.

ఐటెం సాంగ్స్‌ మాటేంటని అడిగితే, ఐటెం సాంగ్స్‌ ఏమైనా తక్కువా వాటికుండాల్సిన డిమాండ్‌ వాటికుంది అంటోంది. ఇప్పుడున్న హీరోయిన్స్‌తో సమానంగా తనకూ పాపులారిటీ ఉందంటోంది. తాను ఇంతవరకూ చేసిన ఏ సినిమాలోనూ తన పాత్ర సెకండ్‌ హీరోయిన్‌ పాత్రగా తాను చూడలేదనీ కేథరీన్‌ అంటోంది. సెకండ్‌ హీరోయిన్‌ అయినా కానీ కేథరీన్‌ది గోల్డెన్‌ లెగ్గే. ఆమె నటించిన సినిమాలేమీ ఫెయిల్‌ అయ్యింది లేదు. అన్నీ సూపర్‌ హిట్సే. దటీజ్‌ కేథరీన్‌.

You May Like This
- Advertisment -spot_img

Most Popular