HomeMovie News Telugu'ఉయ్యాలవాడ' అంతా సస్పెన్స్‌

‘ఉయ్యాలవాడ’ అంతా సస్పెన్స్‌

చిరంజీవి 151వ సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న మాట వాస్తవమే. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమాలో హీరోయిన్‌ గురించి ఇప్పటికే ఓ క్లారికటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ముద్దుగుమ్మ నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌ అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. నెగెటివ్‌ రోల్‌లో కన్నడ సూపర్‌ స్టార్‌ ఉపేంద్ర నటిస్తున్నాడట. ఇలాంటి గాసిప్స్‌ ఎన్నెన్నో వచ్చేస్తున్నాయి.

అయితే ఇంతవరకు వీటిని ‘ఉయ్యాలవాడ’ టీమ్‌ ధృవీకరించలేదు. వచ్చే నెలలో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంది. ఆగస్ట్‌ 15వ తేదీన సినిమా లాంఛనంగా ప్రారంభమవుతుందని సమాచారమ్‌. సురేందర్‌ రెడ్డి ఈ సినిమాని చాలా ప్రతిష్ఠాత్మకంగా భావించి తెరకెక్కించనున్నారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ ఐశ్వర్యారాయ్‌ కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా కూడా వార్తలు వినవస్తున్నాయ్‌. అయితే హీరోయిన్‌, విలన్‌, ఇతర నటీనటులు, టెక్నీషియన్లపై చిత్ర దర్శక నిర్మాతలు ఖచ్చితమైన ఐడియాతో ఉన్నారట.

కానీ ప్రస్తుతానికి అవన్నీ గోప్యంగా ఉంచారు. అన్ని వివరాలూ త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు. అప్పటిదాకా గాసిప్స్‌ ఆగవు. ఎందుకంటే ఇది మెగాస్టార్‌ మూవీ. అందుకే ఇంత హైప్‌, ఇంత టెన్షన్‌. ఏది ఏమైనా ఆగష్టులో ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు బయటికి రావడం పక్కా. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నిర్మించనున్నారు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular