HomeMovie News Teluguబోయపాటి చాలా కాస్ట్‌లీ బాస్‌

బోయపాటి చాలా కాస్ట్‌లీ బాస్‌

బెల్లంకొండ సినిమాల్లో నటించే వారికే కాదు, టెక్నీషియన్స్‌కి కూడా భారీ మొత్తంలో ముట్టచెబుతారు. అలాగే ప్రస్తుతం బెల్లంకొండతో సినిమా చేస్తున్న దర్శకుడు బోయపాటి శ్రీను భారీ స్థాయిలో రెమ్యునరేషన్‌ తీసుకోబోతున్నారట. ఎంతో తెలుసా? అక్షరాలా 14 కోట్లకు పైనేనట. బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్న ‘జయ జానకి నాయక’ సినిమా కోసం ఇంత మొత్తం అందుకుంటున్నాడని సమాచారమ్‌.

బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటించిన తొలి సినిమా ‘అల్లుడు శీను’ కోసం అప్పట్లో దర్శకుడు వినాయక్‌ కూడా భారీ మొత్తం అందుకున్నారు. అందులో హీరోయిన్‌గా నటించిన సమంతకి, అప్పట్లోనే రికార్డు మొత్తం సమర్పించుకున్నారు. ఐటమ్‌ సాంగ్‌కి కూడా అదే స్థాయిలో రెమ్యునరేషన్‌ ఇచ్చారనే గాసిప్స్‌ అప్పట్లో విన్పించాయి. అలా బెల్లంకొండ సినిమాలు చాలా కాస్ట్‌లీ. ఒక్క రెమ్యునరేషన్‌ విషయంలోనే కాదు, సినిమా నిర్మాణమైన సెట్టింగ్స్‌ విషయంలో కూడా ఎక్కడా రాజీ పడరు.

‘జయ జానకి నాయక’ సినిమా దర్శకుడికే కాదు, హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి కూడా కాసుల పంట పండించిందని సమాచారమ్‌. కెరీర్‌లో ఇప్పటిదాకా అందుకోనంత భారీ రెమ్యునరేషన్‌ రకుల్‌కి ఈ సినిమా అందించిందంటున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్‌ సినిమాలంటే హీరోయిన్స్‌తో పాటు, టెక్నీషియన్స్‌ అందరికీ పంట పండినట్లే మరి. ఈ సినిమా ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular