HomeMovie News Teluguఅక్క చెల్లెళ్ళ అందాల ఆరబోత

అక్క చెల్లెళ్ళ అందాల ఆరబోత

‘చిరుత’ ఫేం నేహా శర్మ బాలీవుడ్‌కి వెళ్ళిపోయిందిగానీ, అక్కడా అవకాశాల్లేవు. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌తో తెలుగులో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే విజయం అందుకుంది. అలాగే తెలుగు ప్రేక్షకుల్ని బాగానే అలరించింది కూడా. పూరీ మార్క్‌తో హీరోయిన్‌గా ఆ సినిమాలో అమ్మడి అంద చందాలు ఆడియన్స్‌కి భలే కిక్కిచ్చాయి. అయితే ఆ తర్వాత తెలుగులో ఆమె చేసిన సినిమాలేమీ పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతోనే ఆమె బాలీవుడ్‌ వైపు చూడాల్సి వచ్చింది.

అయితే ఇప్పుడు తిరిగి తెలుగులోకి రావడానికి ట్రై చేస్తోందట. కానీ ఇక్కడా ఎవరూ ఆమెకు అవకాశాలివ్వడంలేదు. తనకే అవకాశాల్లేని టైమ్‌లో తన సోదరి ఐషా శర్మని కూడా సినీ రంగంలోకి దించింది నేహా శర్మ. ఐషా సింగిల్‌ సినిమా వండర్‌గానే మిగిలిపోయింది. దాంతో అక్కాచెల్లెళ్ళిద్దరూ ఇప్పుడు సరికొత్తగా టైమ్‌పాస్‌ చేస్తున్నారు. రోజులో ఎక్కువ సమయం ఈ శర్మ సిస్టర్స్‌ జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తూనే గడిపేస్తుండడం గమనించదగ్గది. అలా జిమ్‌లో హాట్‌ హాట్‌గా ఎక్సర్‌సైజ్‌లు చేసేస్తూ, ఆ వీడియోస్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ కుర్రకారుని హీటెక్కించేందుకు నానా తంటాలూ పడుతున్నారు.

ఇదివరకట్లో నేహాశర్మకి సోషల్‌ మీడియాలో ఫాలోవర్స్‌ ఎక్కువే ఉండేవారు. ఇప్పుడు ఆ ఫాలోవర్స్‌ సంఖ్య కూడా తగ్గిపోయింది. మళ్లీ ఇప్పుడిప్పుడే ఆ ఫాలోయింగ్‌ పెంచుకోవాలని చూస్తోందట ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా, హీటెక్కించేలా షార్ట్‌ జిమ్‌ డ్రస్సులతో ఈ శర్మ సిస్టర్స్‌ అందాల విందు చేసేస్తున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular