HomeMovie News Teluguదర్శకేంద్రుడి పై తాప్సీ కామెంట్స్!

దర్శకేంద్రుడి పై తాప్సీ కామెంట్స్!

హీరోయిన్లని గ్లామరస్ గా చూపించడంలో సిద్ధహస్తుడైన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పై ఆయన చేత పరిచయం కాబడిన ఓ హీరోయిన్ ఆయన పై సెటైర్లు వేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

వివరాల్లోకి వెళితే, హీరోయిన్ తాప్సీ, ఓ హిందీ టాక్ షోలో మాట్లాడుతూ- తన మొదటిచిత్రం అయిన ఝుమ్మందినాదంలో కొబ్బరికాయని ప్రాపర్టీ గా వాడి తీసిన పాటలో దర్శకుడు తన నాభి పైన కొబ్బరిచిప్పతో కొట్టడాన్ని తనకి ఆశ్చర్యం కలిగించింది అని చెప్పింది.

అప్పటికే ఆయన తన హీరోయిన్స్ పై పూలని, పండ్లని వాడడం చూసాను అని కాని అలాంటిది తన పై కొబ్బరిచిప్ప ఎందుకు వాడవలసి వచ్చిందో తెలియదు అని అన్నది. ఇలా వ్యాఖ్యానించిన తాప్సీ పై ఇప్పుడు అందరు ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

తనకి ఇష్టం లేకుండా అయితే ఎవరు అలా నటింపచేయరు కదా అలాగే అంత పెద్ద డైరెక్టర్ పై ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదు అని అందరు తాప్సీ చేసినదాన్ని తప్పు పడుతున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular