HomeMovie News Teluguనయనతారకి బంపర్‌ ఆఫర్‌

నయనతారకి బంపర్‌ ఆఫర్‌

మహా భారతంలో ద్రౌపది పాత్రకు ఓ ప్రత్యేకత ఉంది. పాండవులు ఐదుగురికీ ఏకైక భార్యగా ద్రౌపది చరిత్రలో నిలిచింది. అలాంటి ప్రత్యేకత గల పాత్రలో నయనతార నటించబోతోందట. కన్నడలో ‘కురుక్షేత్ర’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. నాగన్న ఈ సినిమాకి దర్శత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో దుర్యోధనుడిగా దర్శన్‌, కర్ణుడిగా రవిచంద్రన్‌, భీష్ముడిగా అమ్రీష్‌ నటిస్తున్నారు. ఈ సినిమాలో ద్రౌపది పాత్ర కోసం చిత్ర యూనిట్‌ నయనతారను సంప్రదించినట్లు సమాచారమ్‌.

అయితే నయనతార ప్రస్తుతం చాలా బిజీయెస్ట్‌ హీరోయిన్‌. కోలీవుడ్‌లో ఆమెకు చేతి నిండా అవకాశాలే. పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడా లేకుండా, యంగ్‌ హీరోస్‌కీ, స్టార్‌ హీరోస్‌కీ కూడా నయన్‌ ది ఫస్ట్‌ ఆఫర్‌. అలాంటి తరుణంలో నయన్‌ ఈ బంపర్‌ ఆఫర్‌ని టేకప్‌ చేస్తుందా? అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అయితే నయన్‌ ట్రేక్‌ రికార్డ్‌ చూస్తే, గతంలో ‘శ్రీరామ రాజ్యం’ సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించింది నయనతార. ఇటీవలే ‘కాష్మోరా’ సినిమాలోనూ మహారాణి పాత్రలో రాజసం ప్రదర్శించింది.

అందుకే ఈ పాత్రకు నయన్‌ అయితేనే న్యాయం చేయగలదనీ చిత్ర యూనిట్‌ యోచిస్తోంది. అన్నట్లు నయనతారకు తెలుగలోనూ రెండు మూడు ప్రాజెక్టులున్నాయి. అందులో ఒకటి గోపీ చంద్‌ ‘ఆరడుగుల బుల్లెట్‌’ కాగా, ఇంకోటి బాలయ్య సినిమా. ఇంత బిజీ షెడ్యూల్‌లో నయనతార భారీ బడ్జెట్‌ సినిమా అయిన ‘కురుక్షేత్ర’కు డేట్స్‌ ఇస్తుందో లేదో చూడాలిక. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular