HomeMovie News Teluguనందమూరి అన్నదమ్ముల అనుబంధం

నందమూరి అన్నదమ్ముల అనుబంధం

నందమూరి అన్నదమ్ములు కళ్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌ ఇద్దరూ కలిసి పని చేస్తున్న సినిమా ‘జై లవకుశ’. ఈ సినిమాకి కళ్యాణ్‌రామ్‌ నిర్మాతగా వ్యవహరిస్తుండగా బాబీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ మూడు గెటప్స్‌లో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు కళ్యాణ్‌రామ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ తన అన్నయ్య కళ్యాణ్‌రామ్‌ని ఆప్యాయంగా హత్తుకుని ఉన్న ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి, ‘హ్యాపీ బర్త్‌డే అన్నా..’ అని ట్వీట్‌ చేశాడు.

ఈ ఫోటో పోస్ట్‌ చేసిన కాస్సేపటికే లైకుల వరద మొదలైంది. అంత చూడ ముచ్చటగా ఉంది మరి ఈ అన్నదమ్ముల అనుబంధం. ఎన్టీఆర్‌ పుట్టినరోజుకు కళ్యాణ్‌ రామ్‌ కూడా ఇలాంటి ఫోటోనే పోస్ట్‌ చేసి తమ్ముడికి బర్త్‌డే విషెస్‌ చెప్పాడు. ప్రస్తుతం ఈ ఇద్దరి కలయికలో వస్తోన్న సినిమా ‘జై లవకుశ’ కోసం కష్టపడుతున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాశీఖన్నా, నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిర్మాతగా కళ్యాణ్‌రామ్‌ చిత్ర నిర్మాణంలో ఏమాత్రం రాజీ పడకుండా చాలా రిచ్‌గా సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

మరో పక్క కళ్యాణ్‌రామ్‌ ‘ఎమ్మెల్యే’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ముద్దుగుమ్మ కాజల్‌, కళ్యాణ్‌ రామ్‌కి జోడీగా నటిస్తోంది. ఒక పక్క హీరోగా, మరో పక్క నిర్మాతగా రెండు పనులనూ ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తున్న కళ్యాణ్‌రామ్‌కి మనం కూడా హ్యాపీ బర్త్‌డే విషెస్‌ చెప్పేద్దాం!

You May Like This
- Advertisment -spot_img

Most Popular