HomeMovie News Teluguరాజమౌళి గారి మాటలు నన్ను ఇబ్బందిపెట్టాయి: శ్రీదేవి

రాజమౌళి గారి మాటలు నన్ను ఇబ్బందిపెట్టాయి: శ్రీదేవి

బాహుబలి ఎందుకు వదిలేశారు అనే ప్రశ్నకి విసుగెత్తిపోయిన నటి శ్రీదేవి, అసలు తనకి రాజమౌళికి బాహుబలి గురించిన చర్చల సందర్భంలో ఏం జరిగిందో బయటపెట్టింది.

ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ- రాజమౌళి గారు బాహుబలి కథ చెప్పడానికి వచ్చినప్పుడు తమ మధ్య కేవలం క్రియేటివ్ డిస్కషన్స్ తప్ప రెమ్యునరేషన్ గురించి అసలు మాటలే రాలేదని చెప్పింది. అలాంటిది, తను రూ 8కోట్ల వరకు డిమాండ్ చేసానని అలాగే తన కుటుంబసభ్యులందరికి హోటల్ రూమ్స్ బుక్ చేయమని అడిగాను అని చెప్పడం అవాస్తవం అని చెప్పింది.

తను అసలు కథకి మొదటి ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిని అని అంతే తప్పరెమ్యునరేషన్ గురించిన డిమాండ్స్ తన దగ్గరనుండి ఏరోజు రాలేదు అని తెలిపింది. ఒక వేల తాను డిమాండ్ చేసే టైపు అయిఉంటే ఇప్పటికి 300 సినిమాలు చేసి ఉండను అని తన బాధని వ్యక్తం చేసింది.

రాజమౌళిగారు తన గురించి పబ్లిక్ గా ఒక ఇంటర్వ్యూ లో అలా చెప్పడం నిజంగా తనని బాధ పెట్టడమే కాక ఇబ్బందికి గురిచేశాయి అని ఈ కాంట్రవర్సీ పైనతన వివరణ ఇచ్చింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular