HomeMovie News Teluguరోడ్డు ప్రమాదంలో హీరో రవితేజ తమ్ముడు మృతి

రోడ్డు ప్రమాదంలో హీరో రవితేజ తమ్ముడు మృతి

తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నటుడు భరత్ (46) మృతిచెందాడు.

అందుతున్న వివరాల ప్రకారం, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నోవాటెల్ హోటల్ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా, కొత్వాల్ గూడ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని కారుతో (TS09EC 799) డీకొట్టడం జరిగింది.

ప్రమాదం జరిగిన వెంటనే భరత్ మృతిచెందినట్టు ప్రమాదం జరిగిన తీరు చూస్తే తెలుస్తుంది. ఇక కారు భరత్ తల్లి రాజ్యలక్ష్మి పేరుతో రిజిస్టర్ అయ్యి ఉండడం అలాగే ప్రమాదంలో భరత్ ముఖానికి తీవ్ర గాయాలు అవ్వడంతో అతన్ని గుర్తుపట్టడంలో తీవ్ర జాప్యం జరిగింది.

ప్రస్తుతం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరిలించారు.  

You May Like This
- Advertisment -spot_img

Most Popular