HomeMovie News Teluguనాగ్‌ని ఇంప్రెస్‌ చేసిందండోయ్‌

నాగ్‌ని ఇంప్రెస్‌ చేసిందండోయ్‌

నాగార్జున స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’. నాగ చైతన్య, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ సినిమాలో ‘భ్రమరాంబ’ పాత్రలో నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఆడియో సింగిల్‌ ‘భ్రమరాంబకి నచ్చేశాను..’ దుమ్ము రేపుతోంది. ఈ పాటలో రకుల్‌ ఆట, పాట అదరిపోయాయంటున్నారు ఆమె అభిమానులు.

ఇంతవరకూ రకుల్‌ చేసిన పాత్రలన్నింట్లోనూ ఈ సినిమాలో పాత్రకు ప్రాధాన్యత ఎక్కువంటోంది. చాలా అరుదుగా ఇలాంటి పాత్రలు దక్కుతాయంటోంది ఈ స్మైలీ బ్యూటీ. ఈ సినిమాలో తన పాత్ర నాగార్జునకు చాలా నచ్చేసిందట. పల్లెటూరి అమ్మాయి పాత్రలో ట్రెడిషనల్‌ లుక్‌తో ఆకట్టుకుంటోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. అలాగే రారండోయ్‌.. పాటలో రకుల్‌ డోలు వాయించే పద్దతి చూస్తుంటే ఎంతందంగా ఉందో కదా. ఆమెపై ఉన్న అభిమానం మరింత రెట్టింపవుతోంది ఆ స్టిల్‌ చూస్తుంటే. అందుకే మరి నాగ్‌కి కూడా నచ్పేసిందట ఆ స్టిల్‌.

ఈ సినిమాలో ఈ ఒక్క స్టిల్లే కాదండోయ్‌ అన్ని స్టిల్స్‌ ఆదిరిపోయాయి. సినిమా కూడా అలాగే ఫీల్‌ గుడ్‌ మెమరీగా ఉంటుందంటున్నారు. నాగ్‌ని అంతగా ఇంప్రెస్‌ చేసిందిగా ఈ ముద్దుగుమ్మ త్వరలోనే నాగార్జునతో కలిసి సమంతలా ‘మనం’ తరహా మూవీలో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటే చూడాలని ఉందని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. ‘సోగ్గాడే చిన్న నాయనా’ ఫేం కళ్యాన్‌ కృష్ణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular