HomeMovie News Teluguఅతిలోక సుందరి అందరికీ అమ్మే

అతిలోక సుందరి అందరికీ అమ్మే

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా చేసేటప్పటికే హీరోయిన్‌గా ఎవరెస్ట్‌ శిఖరం అంతటి ఎత్తులో నిలిచి ఉన్న ముద్దుగుమ్మ శ్రీదేవి. ఆ టైంలో చిరంజీవితో ఆ సినిమాలో నటించాక నిజంగా ఆమె అందరికీ అతిలోక సుందరి అయిపోయింది. ఈ అతిలోక సుందరి సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసిన తర్వాత కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటోంది. ‘ఇంగ్లీస్‌ వింగ్లీష్‌’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి తర్వాత ‘పులి’ తదితర చిత్రాల్లో నటించింది. తాజాగా ‘మామ్‌’ అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతోంది.

ఈ చిత్రం ఆమెకి 300వ చిత్రం కావడం విశేషం. ‘బూచాడమ్మ బూచాడు.. బుల్లి పెట్టెలో ఉన్నాడు.. ‘ అంటూ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఆకట్టుకున్నా, ‘పదహారేళ్ల వయసు’ సినిమాతో పదహారణాల తెలుగు పడుచుపిల్లగా లేలేత అందాలతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లోకి వచ్చి శ్రీదేవి 50 ఏళ్లు కావస్తోంది. అయినా కానీ ఆమెకున్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. అతిలోక సుందరి అంటే ఆమె. నో డౌట్‌ అంటారు ఎవరైనా.

తాజా చిత్రం ‘మామ్‌’ జూలై 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నారు. భర్త బోనీకపూర్‌ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరో పక్క శ్రీదేవి తనయలు కూడా హీరోయిన్లుగా సినీ రంగాన్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular