HomeMovie News Teluguపవన్‌తో అయితే మరో సెన్సేషనే!

పవన్‌తో అయితే మరో సెన్సేషనే!

విజయేంద్రప్రసాద్‌ అందించిన కథలు సినిమా పరంగా ఘన విజయం సాధించడమే కాకుండా, వసూళ్ల పరంగా బాక్సాఫీసు రికార్డుల్ని తిరగ రాసేశాయి. అలాంటి విజయేంద్రప్రసాద్‌ ఈ మధ్య ఓ సెన్సేషనల్‌ వ్యాఖ్యలు చేశారు. పవన్‌పై తనకున్న అభిమానాన్ని చాటి చెబుతున్నాయి ఆ వ్యాఖ్యలు. పవన్‌ అంటే చాలా మందికి అభిమానం ఉంది. అయితే ఆ అభిమానం ఓ జాతీయ స్థాయి గుర్తింపు పొందిన సినిమాకి సీన్‌ రాసేంత స్పూర్తినిచ్చిందంటే చిన్న విషయం కాదు.

కానీ అది జరిగిందిక్కడ. మెగా ఫంక్షన్స్‌లో పవన్‌ కోసం పవన్‌ అభిమానులు చేసే గొడవ సంగతి తెలిసిందే. అలాంటి పవన్‌ కోసం విజయేంద్ర ప్రసాద్‌ ఓ కథ రాస్తే ఎలా ఉంటుంది. ఊహించుకోండి. త్వరలోనే ఈ ఊహ నిజమయ్యేలా ఉంది. విజయేంద్రప్రసాద్‌ పవన్‌ కోసం ఓ అదిరిపోయే కథ రాయనున్నారట. అదే కనుక జరిగితే పవన్‌ ఇమేజ్‌ని ఇన్సిపిరేషన్‌గా తీసుకుని చేసిన ఒకే ఒక్క సీనే ఇంత అద్భుతంగా ఉంటే, ఇక ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన కోసమే కథ రాస్తే అది ఇంకెంత అద్భుతంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం.

ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో పవన్‌ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత నేశన్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది పవన్‌. అప్పటికి విజయేంద్రప్రసాద్‌ కథ సిద్ధం చేస్తే ఆ కథలో పవన్‌ నటిస్తే.. ఇంకేముంది అది మరో భారీ సెన్సేషన్‌ కాక తప్పదు. ‘కాటమరాయుడు’తో నిరాశ పడిన పవన్‌ ఫ్యాన్స్‌ ఆయన నుండి అలాంటి భారీ సెన్సేషన్‌ కోసం ఆశక్తిగా వెయిట్‌ చేస్తున్నారు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular