HomeMovie News Telugu'రామాయణం'లో రాముడిగా చరణ్‌?

‘రామాయణం’లో రాముడిగా చరణ్‌?

అభిమాని ఓ ఫొటో సోషల్‌ మీడియాలో పెట్టాడు. ఇది వైరల్‌గా మారింది. చరణ్‌ ‘రామాయణం’లో నటిస్తే, రామాయణానికి హీరో అయిన రాముడి పాత్రలో చరణ్‌ కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించాడు. ఆ ఊహకిలా రూపమిచ్చాడు. స్టిల్‌ సూపర్బ్‌గా ఉంది. అల్లు అరవింద్‌ మరికొందరితో కలిసి ‘రామాయణం’ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అయితే నటీనటుల గురించి ఇంతవరకు ఎలాంటి ప్రకటనా రాలేదు.

ఈలోగా ఈ సినిమాలోని పాత్రల గురించి, పలువురు పలు రకాల రూమర్స్‌ క్రియేట్‌ చేయడమే కాకుండా, టెక్నాలజీ యూజ్‌ చేసుకుని గ్రాఫిక్స్‌లో తమ అభిమాన నటులకి, తగ్గ పాత్రలివి అంటూ తమలోని క్రియేటివిటీకి పదును పెట్టేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా మెగా అభిమానులిలా రాముడి పాత్రలో చరణ్‌ని ఊహించుకోవడం జరుగుతోంది.ఈ మధ్యనే ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమాలో చిరంజీవి ఎలా ఉంటే బాగుంటారో ఊహించుకుని ఓ అభిమాని అద్భుతమైన స్టిల్‌ రూపొందించాడు. అది పెద్ద సంచలనంగా మారింది.

ఆ తర్వాత అంతటి సంచలనం చరణ్‌, రాముడి గెటప్‌లో ఉన్న స్టిల్‌ నమోదు చేసింది. సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని ఇలా పంచుకుంటున్నారు. వాటికి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. రెస్పాన్స్‌తో పాటు ఇలాంటివి కొన్ని సెన్సేషన్స్‌ అయిపోతున్నాయి కూడా. అతి కొద్ది సమయంలోనే జనానికి అత్యంత సులువుగా ఇవి చేరువయిపోతున్నాయి. రాముని పాత్రలో చరణ్‌ నటిస్తే ఆ పాత్ర చిత్రీకరణ ఇలా ఉండాలని ఆ అభిమాని ఊహ బావుంది. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular