HomeMovie News Teluguజబర్దస్త్' ఫేమ్ వినోద్ ఆత్మహత్యాయత్నం...!!

జబర్దస్త్’ ఫేమ్ వినోద్ ఆత్మహత్యాయత్నం…!!

జబర్దస్త్ ఫేం వినోద్ ఈ పేరు తెలియని వారుండరు. బుల్లితెరమీద తన లేడీ గెటప్ తో సంచలన విజయాన్ని అందుకుని నవ్వులతో హుషారెత్తించే కమెడియన్ వినోద్. ఇతను చేసే కామెడీకి బుల్లితెర ప్రేక్షకులందరూ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ గా మారారు. సంజామల మండలంలోని బొందలదిన్నె గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. జబర్దస్త్‌ నటుడు వినోద్‌కు తల్లి శిరోమణమ్మ, అతని బంధువులు బొందలదిన్నె గ్రామానికి చెందిన లక్ష్మమ్మ ఇంట్లో వివాహం చేయాలని నిర్ణయించారు. వివాహం చేసుకోవాలని ఈ సందర్భంగా వారంతా వినోద్‌ను బలవంత పెట్టారు.

దీంతో, వినోద్ తన చేతిని గాయపర్చుకున్నట్టు సమాచారం. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆ పెళ్లిని ఆపేశారు. వినోద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వినోద్ జబర్దస్త్ షో తో పాటు పలు రియాలిటీ షోల్లో, స్టేజ్ కార్యక్రమాల్లో పాల్గొంటూ బేజీ గా ఉంటున్నాడు. జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర తో ఆడవేశంతో జతకట్టిన వినోద్ వినోదానికి చాలా మంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

కాకపోతే కుటుంబ సభ్యులు ఇలా ఆడవేషాలు వేస్తూ నటించడం వల్ల అది అతనిపై ఎప్పుడు ఎలా ప్రభావాన్ని చూపి అతని జీవితాన్ని నాశనం చేస్తుందో అని భయపడ్డ వారి బంధువులు అతనికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకోగా అతను దానికి ససేమిరా అన్నట్టు తెలిసింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular