HomeMovie News Teluguబాబోయ్‌ సంపూ వాట్‌ ఈజ్‌ దిస్‌

బాబోయ్‌ సంపూ వాట్‌ ఈజ్‌ దిస్‌

కామెడీ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు సెన్సేషన్‌ గురించి అందరికీ తెలిసిందే. ఈ రోజు ఆయన పుట్టినరోజు. తొలి సినిమా ‘హృదయ కాలేయం’తో సంపూ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. కామెడీ హీరోగా ఆయనది ఓ వైవిధ్యమైన పంథా. స్పూఫ్‌లు చాలా మంది కామెడీ హీరోలు చేస్తారు. కానీ సంపూర్ణేష్‌ బాబు చేస్తే ఆ స్పూఫ్‌కే అందమొచ్చేస్తుంది. అంతకన్నా మించి నవ్వొచ్చేస్తుంది. అదే సంపూ కామెడీ స్టైల్‌. అలా స్పూఫ్‌లతో తెరకెక్కిన ‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి పాపులర్‌ అయ్యాడు సంపూర్ణేష్‌ బాబు.

ఆ తర్వాత పలు చిత్రాల్లో గెస్ట్‌ రోల్స్‌లో కనిపించాడు. సంపూ స్టేజ్‌పై కనిపిస్తే చాలు జనంలో నవ్వులే నవ్వులు. ఇక డైలాగ్‌ పేల్చాడా ఇంక అంతే సంగతి. సంపూర్ణేష్‌ బాబు తాజా చిత్రం ‘కొబ్బరి మట్ట’. రూపక్‌ రొనాల్డ్‌సన్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే అంతా షాక్‌ తినక తప్పదు. మన సంపూర్ణేష్‌ బాబు ఫ్యామిలీ సంగతి తెలిస్తే అంతే మరి. ఈయనకి ఏడుగురు భార్యలు, పన్నెండు మంది పిల్లలు, నలభై మంది మనవలు మనవరాళ్లట.

వావ్‌ విచిత్రంగానే ఉంది కదా. వామ్మో సంపూకి ఫ్యామిలీ ప్లానింగ్‌ చేయించాల్సిందే. లేదంటే దేశంలో జనాభా పెరుగుదల మరీ పెరిగిపోతుంది. ఈ సినిమాలో ఈయన మూడు డిఫరెంట్‌ టైప్‌ ఆఫ్‌ క్యారెక్టర్స్‌లో కనిపిస్తారు. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడు పాత్రల్లో సంపూ నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular