HomeMovie News Teluguబాహుబలి2 కోసం 500 టికెట్స్ ని బుక్ చేసిన కలెక్టర్?

బాహుబలి2 కోసం 500 టికెట్స్ ని బుక్ చేసిన కలెక్టర్?

బాహుబలి 2 సినిమా ఫీవర్ తో సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల దాకా జనాలు ఊగిపోతున్నారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ గా చెప్పుకోవచ్చు.

తెలుస్తున్న వివరాల ప్రకారం, వరంగల్ లోని ఒక ప్రముఖ ధియేటర్ లో ఒక షో మొత్తంగా (దాదాపుగా 500 టికెట్స్) బుక్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇలా బుక్ చేసింది మరెవరో కాదు, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి.

దీనితో ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు. అసలే టికెట్స్  దొరక్క అందరూ తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే ఇలా తమ పరపతిని ఉపయోగించి టికెట్స్ బల్క్ గా బుక్ చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.

అయితే దీనిపై వరంగల్ కలెక్టర్ కాని కలెక్టర్ కార్యాలయం కాని స్పందించాల్సి ఉంది. ఏదైతే ఏంటి, బాహుబలి మేనియా సామాన్యుల నుండి ప్రభుత్వ పెద్దల వరకు పాకింది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular