HomeMovie News Teluguఅందాల అనుష్క గొప్పతనమదే

అందాల అనుష్క గొప్పతనమదే

గొప్ప నటి కాకపోయినా ‘అరుంధతి’ లాంటి సినిమాతో మెప్పించింది అనుష్క. గ్లామర్‌ తారగా మాత్రమే ఇండస్ట్రీలో అంతవరకూ పేరు తెచ్చుకున్న స్వీటీ బ్యూటీ కెరీర్‌ టర్న్‌ అయిపోయింది ఆ సినిమాతో. ఆ సినిమాలో జేజమ్మగా అనుష్కని తప్ప మరో నటిని ఊహించుకోవడం కష్టం. అంతగా ఆ క్యారెక్టర్‌లో మెప్పించింది అనుష్క. తెలుగు తెరపై నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా ఇప్పటికీ అనుష్క సత్తా చాటుతోంది. వయసు మీద పడ్తున్న కొద్దీ అనుష్క కొత్త గ్లామర్‌తో వెలిగిపోతుండడం ఆశ్చర్యకరం.

అంతేకాదు ప్రయోగాలు చేసే హీరోయిన్‌గా కూడా అనుష్కదే తొలి స్థానం అని చెప్పొచ్చు ఈ జనరేషన్‌ హీరోయిన్స్‌లో. అలాగే ఇప్పటికీ తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌ అనుష్కే. ఇంతలా అనుష్క తెలుగు తెరను ఏలుతోందంటే దానిక్కారణం ఆమె సింప్లిసిటీయే కావొచ్చు. అంతకు మించి వర్క్‌ పట్ల డెడికేషన్‌ కూడా ఓ ముఖ్య కారణమంటాడు దర్శక ధీరుడు రాజమౌళి. అనుష్క గొప్ప నటి ఏమీ కాదుగానీ, తనకు తెలియని విషయాల్ని తెలుసుకోవాలని, ఇంకా కొత్తగా చేయాలనీ ఆమె పడే తపనే ఆమెను ఈస్థాయికి తీసుకొచ్చిందంటాడు రాజమౌళి.

అవును అనుష్క కాబట్టే ‘సైజ్‌ జీరో’ సినిమా చేయగలిగింది. ఆమె తప్ప ఇంకెవరూ అలాంటి సాహసం చేయలేరు. ‘బాహుబలి’కి ఈ స్థాయిలో హైప్‌ రావడానికి కారణం అనుష్కకి ఉన్న స్టార్‌డమ్‌ కూడా. ఇవన్నీ వెరసి దేవసేనగా వీరత్వంతో పాటు గ్లామర్‌ లుక్‌లో కూడా అలరించేయడానికి ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’తో ఈ శుక్రవారం మన ముందుకు వచ్చేస్తోంది స్వీటీ బ్యూటీ అనుష్క. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular