HomeMovie News Teluguతెలుగువాళ్ళకి హ్యాండ్ ఇచ్చిన రాజమౌళి

తెలుగువాళ్ళకి హ్యాండ్ ఇచ్చిన రాజమౌళి

బాహుబలి చిత్రాన్ని తమ గౌరవాన్ని పెంచిన సినిమాగా తెలుగు వారందరూ ఉప్పొంగుతున్న వేళ, దర్శకుడు రాజమౌళి తెలుగువారికి హ్యాండ్ ఇవ్వబోతున్నాడు.

అదేంటంటే, బాహుబలి రిలీజ్ సందర్భంగా నిర్వహించే ప్రీమియర్ షో ని హైదరాబాద్ లో కాకుండా ముంబై లో ఏప్రిల్ 27న నిర్వహించేందుకు సిద్ధమవడమే. ఇప్పటికే బాలీవుడ్ లో ఒక వారం పాటు తిష్ట వేసి మరి బాహుబలి మెయిన్ లీడ్స్ బాహుబలి 2 యొక్క ప్రొమోషన్ చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రీమియర్ షో నే ముంబై తరలించేసే పనిలో ఉన్నారు.

మన తెలుగు సినిమా స్థాయిని పెంచాలనుకోవడం మంచిదే కాని ఇలా పూర్తిగా తెలుగు వెర్షన్ ని నిర్లక్ష్యం చేసేలా ఉండకూడదు అని అభిప్రాయపడుతున్నా వారు లేకపోలేదు.

బాహుబలి అలాగే ప్రభాస్ అభిమానులు మాత్రం ఇది జీర్ణించుకోలేకపోతున్నారు. అసలే బెనిఫిట్ షోస్ ఉంటాయో ఉండవో అనే సందిగ్ధ పరిస్థితులు ఉన్న నేపధ్యంలో ఇలా జరగడం సగటు తెలుగు అభిమానులకి బాధ కలిగించేదే!

మరి రాజమౌళి ఈవైపు గా ఆలోచిస్తాడో లేదో ఆయనకే తెలియాలి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular