HomeMovie News Teluguబాహుబలి 2 మొత్తానికి అదే హైలైట్ అంట!

బాహుబలి 2 మొత్తానికి అదే హైలైట్ అంట!

ఎక్కడ చూసినా ఒకటే మాట. అది బాహుబలి… బాహుబలి.. బాహుబలి.

వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఇలాంటి తరుణంలో బాహుబలి 2కి సంబంధించి ఏ ఒక్క చిన్న క్లూ అయిన అది ఓ పెద్ద హాట్ టాపిక్ అయ్యే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలోనే బాహుబలి VFX Supervisor అయిన కమలా కన్నన్ ఈ చిత్రంలో ఉన్న కొన్ని హైలైట్ సీన్స్ గురించి చెప్పేశాడు.

ఆయన చెప్పిన దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ లో VFX వర్క్ చాలా ఉందని అలాగే మొదటి భాగంలో వచ్చిన జలపాతం కన్నా హైలైట్ సీన్ రెండవ భాగంలో ఉందని తెలిపాడు.

ఇంకొక ఆసక్తికర విషయానికి వస్తే, పూర్తి గ్రాఫిక్స్ తో ఒక పాటని చిత్రకరించినట్టు చెప్పాడు. ఇప్పటివరకు ఎక్కువగా సీజీ వర్క్ చేసిన సినిమాగా బాహుబలి నిలుస్తుందని కమలా కన్నన్ స్పష్టం చేశాడు.

సినిమాకి ముందు ఇలాంటి లీక్స్ సినిమా పైన అంచానాలు పదింతలు చేస్తాయి. అదే బాహుబలి 2 కి సంబంధించి అయితే ఆ కిక్కే వేరు కదా.

You May Like This
- Advertisment -spot_img

Most Popular