HomeMovie News Teluguచైతూకి సమంత క్యూట్‌ రిక్వెస్ట్‌

చైతూకి సమంత క్యూట్‌ రిక్వెస్ట్‌

సమంత సోషల్‌ మీడియాలో ఏ పోస్ట్‌ పెట్టినా, అది సంచలనమే. తాజాగా సమంత చేసిన పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌ అయ్యింది. చైతూతో కలిసి సమంత సరదాగా డాన్స్‌ చేస్తూ ఉన్న ఫోటో అది. దానికి ‘రోజూ.. నన్ను నువ్వు రక్షించు’ అంటూ పోస్ట్‌ చేస్తూ, ఎప్పటికీ తోడుండు అనే అర్ధంతో హ్యాష్‌ ట్యాగ్‌ను కూడా యాడ్‌ చేసింది. సమంత – చైతూ ప్రేమ జ్ఞాపకాలను అప్పుడప్పుడూ ఇలా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

అయితే ఈ సారి వచ్చిన ఈ ప్రేమ సందేశం భలే బాగుందంటూ బోలెడన్ని లైకులిచ్చేస్తున్నారు క్యూట్‌ బేబీ సమంతకు సోషల్‌ మీడియా ఫ్యాన్స్‌. సమంత, చైతూ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే ఈ జంటకి నిశ్చితార్ధం కూడా జరిగింది. త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారు. ఓ పార్టీలో సరదాగా సమంత, చైతూ ఇలా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ ఫోటోలో సమంత చాలా హాట్‌ హాట్‌గా కనిపిస్తోంది.

కాగా సమంత ప్రస్తుతం రామ్‌ చరణ్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమాలో నటిస్తోంది. అలాగే పలు తమిళ చిత్రాల్లో కూడా నటిస్తోంది. అన్నట్లు నాగార్జున ప్రధాన పాత్రలో వస్తోన్న ‘రాజుగారి గది 2’ సినిమాలో సమంత గెస్ట్‌ రోల్‌లో నటిస్తోంది. మరో పక్క చైతూ ప్రస్తుతం కళ్యాణ్‌ కృష్ణ డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటిస్తున్నాడు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular