HomeMovie News Teluguపూరి డైరెక్షన్‌లో వెంకటేష్‌

పూరి డైరెక్షన్‌లో వెంకటేష్‌

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వెంకటేష్‌ హీరోగా ఓ సినిమా సెట్స్‌ మీదకు రాబోతోంది. వెంకటేష్‌ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. బాలకృష్ణతో తెరకెక్కిస్తున్న సినిమా పనుల్లో బిజీగా వున్న పూరి, ఆ సినిమా ఓ కొలిక్కి రాగానే, వెంకీతో సినిమా షూటింగ్‌ని ప్రారంభించే అవకాశాలున్నాయని సమాచారమ్‌. చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్‌ తృటిలో కోల్పోయిన పూరి, బాలకృష్ణతో సినిమా ఓకే చేసుకోవడం, ఆ వెంటనే వెంకటేష్‌తో సినిమాని పట్టాలెక్కించేందుకు ప్రయత్నించడం ఇండస్ట్రీ వర్గాల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అయితే పూరితో సినిమా చేయాలని వెంకీ ఎప్పటినుంచో అనుకుంటున్నారట. కొన్ని కారణాలతో అలా అలా వాయిదా పడుతూ వచ్చిందట. ఈ మధ్యనే వెంకీకి పూరి చెప్పిన కథ నచ్చడంతో సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళేందుకు లైన్‌ క్లియర్‌ అయ్యిందని సమాచారమ్‌. ఇంకో వైపున పూరి, బాలకృష్ణతో చేసే సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఓ షెడ్యూల్‌లో భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ని ఇప్పటికే పూర్తి చేసేశారు. అయితే ఈ సినిమాలో మిగతా తారాగణం ఎవరన్నదానిపై స్పష్టత లేదు.

కొత్తవారిని తీసుకునేందుకోసం టాలెంట్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నాడు పూరి జగన్నాథ్‌. వెంకీ సినిమాకి కూడా అదే ప్రయత్నం చేస్తాడేమో పూరి చూడాలిక. వెంకీ తాజా సినిమా ‘గురు’ విషయానికి వస్తే, విడుదలకు సిద్ధమైన ఈ సినిమా బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’కి రీమేక్‌. ఇందులో వెంకీ బాక్సింగ్‌ కోచ్‌గా నటిస్తున్నాడు. ‘గురు’ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular