HomeMovie News Teluguమేనల్లుడితో పవర్‌స్టార్‌ సినిమా!

మేనల్లుడితో పవర్‌స్టార్‌ సినిమా!

పవన్‌కళ్యాణ్‌ ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ సినిమాని సొంత బ్యానర్‌లో నిర్మించాడు. తాజాగా మరో సినిమాని నిర్మించనున్నాడు. అదే యంగ్‌ హీరో నితిన్‌తో చేయబోయే చిత్రం. దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో కలిసి, నితిన్‌ హీరోగా ఓ సినిమాని పవన్‌ తన సొంత బ్యానర్‌లో నిర్మించనున్నాడన్న సంగతి తెలిసిందే. ఇది ఇప్పటికే అనౌన్స్‌ అయ్యింది కూడా. ఇది కాక త్వరలో పవన్‌ నిర్మాతగా ఇంకో సినిమా ప్రారంభం కానుందట.

ఆ సినిమాలో మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ హీరోగా నటించనున్నాడని సమాచారమ్‌. పవన్‌ నిర్మాతగా చరణ్‌ హీరోగా ఓ సినిమా ప్రారంభం కానుందని గతంలో గాసిప్స్‌ వినవచ్చాయి. అయితే అది కార్యరూపం దాల్చలేదు. అభిమాని అయిన నితిన్‌ కోసమే సినిమా నిర్మించాలని అనుకున్నాడు పవన్‌. మరి తనకెంతో ఇష్టమైన మేనల్లుడి గురించి సినిమా తెరకెక్కించడంలో అభ్యంతరాలేముంటాయి. అయితే ఈ కాంబినేషన్‌లో రాబోయే చిత్రానికి పక్కా స్టోరీ కోసం వెయిటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పవన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘కాటమరాయుడు’ సినిమా షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. ఈ సినిమా త్వరలోనే విడుదలకు రెడీగా ఉంది. తర్వాత కూడా పవన్‌ చేతిలో చేయాల్సిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. మరో పక్క తేజు కూడా సూపర్‌ బిజీగానే ఉన్నాడు. మరి చూడాలిక సాయిధరమ్‌ తేజ్‌తో పవన్‌ సినిమా ఏమవుతుందో !

You May Like This
- Advertisment -spot_img

Most Popular