HomeMovie News Teluguతెలుగమ్మాయి డబుల్‌ ధమాకా!

తెలుగమ్మాయి డబుల్‌ ధమాకా!

తెలుగమ్మాయి అంజలికి తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోయినా, తమిళంలో మాత్రం దూసుకెళ్లిపోతోంది. ఈ ముద్దుగుమ్మ తాజా చిత్రం ‘చిత్రాంగద’. అశోక్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతోంది ఈ చిత్రం. ఈ చిత్రంలో అంజలి పాత్రే సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌. ఆమె పాత్ర రెండు భిన్నమైన షేడ్స్‌లో ఉంటుందట. నెగిటివ్‌ షేడ్స్‌ని కూడా తనలో చూపించినట్లు తెలుస్తోంది అంజలి ఈ సినిమాలో. ఇటీవలే ఈ చిత్రం ట్రైలర్‌ బయటకి వచ్చింది. ఆ ట్రైలర్‌ చూస్తుంటేనే తెలుస్తోంది ఇదో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీ అని.

కొన్ని అదృశ్య శక్తులు అంజలిని వేధిస్తూ ఉంటాయట. వాటి నుండి ఆమె ఎలా బయట పడిందన్నదే సినిమా స్టోరీ. ఎలాంటి పాత్రైనా ఈజీగా రక్తి కట్టించగల టాలెంట్‌ ఉంది అంజలికి. ‘గీతాంజలి’ సినిమాతో ఆల్రెడీ హారర్‌ సస్పెన్స్‌ కాన్సెప్ట్‌ని టచ్‌ చేసింది అంజలి. సక్సెస్‌ కూడా అయ్యింది. అయితే ‘చిత్రాంగద’ ఇప్పుడొస్తున్న హారర్‌ సినిమాలన్నింటికీ పూర్తి భిన్నంగా ఉంటుందట. టెక్నికల్‌ పరంగా చాలా రిచ్‌గా ఉంటుందంటున్నారు.

అంతేకాదు ఈ సినిమా షూటింగ్‌ మొత్తం అమెరికాలో చిత్రీకరించడం మరో విశేషం ఈ సినిమాకి. ‘జెంటిల్‌మెన్‌’ సినిమాలో నాని పోషించిన పాత్రలా ఈ సినిమాలో అంజలి పాత్ర ఉండబోతోందట. ఒకటే క్యారెక్టర్‌ కానీ షేడ్స్‌ డిఫరెంట్‌గా ఉంటాయట. ఇంత ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తోన్న ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ డిఫరెంట్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీలో మన తెలుగమ్మాయి అంజలి అదరగొట్టే పర్‌ఫామెన్స్‌ చూడాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే!

You May Like This
- Advertisment -spot_img

Most Popular