HomeMovie News Teluguతాప్సీ సినిమాకి అరుదైన గౌరవం

తాప్సీ సినిమాకి అరుదైన గౌరవం

తాప్సీ నటించిన ‘పింక్‌’ సినిమాని ప్రత్యేకంగా వీక్షిస్తున్నారు రాష్ట్రపతి. లైంగిక వేధింపులకు గురైన మహిళలకు సంబంధించిన కథ ఇది. ఇందులో లైంగిక వేధింపులకు గురైన మహిళల తరఫున వాదించే లాయర్‌గా అమితాబ్‌ నటించాడు. హిందీలో పెద్ద విజయం సాధించింది ఈ సినిమా. తాప్సీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది ఈ సినిమా. నటిగా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాంటి ఈ సినిమాని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రత్యేకంగా తిలకించడం చాలా గొప్ప విషయం.

అలాగే ఈ సినిమా పలు అంతర్జాతీయ సినీ వేడుకల్లోనూ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే తాప్సీకి బాలీవుడ్‌లో తిరుగు లేకుండా ఉంది. ఈ అరుదైన గౌరవంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ అన్పించుకోవడానికి అతి దగ్గర్లోనే ఉందంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ఇక ఈ మధ్యే విడుదలైన ‘ఘాజీ’ సినిమా కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిన సినిమానే.

ఈ సినిమాలో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోయినా స్టోరీ పరంగా ఈ సినిమా తాప్సీకి బెస్ట్‌ మూవీ అని చెప్పొచ్చు. ఏది ఏమైనా తెలుగులో గ్లామర్‌ నటిగా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ తాప్సీ బాలీవుడ్‌లో ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడం అభినందించదగ్గ విషయమే.

You May Like This
- Advertisment -spot_img

Most Popular