HomeMovie News Telugu'బాహుబలి' ఇక్కడితో ముగిసిపోతుంది

‘బాహుబలి’ ఇక్కడితో ముగిసిపోతుంది

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘బాహుబలి’ సినిమా తొలి పార్ట్‌తోనే ఓ రేంజ్‌ విజయాన్ని అందుకుంది. ఇక ‘బాహుబలి 2’ రాబోతోంది ఇప్పుడు. అయితే ‘బాహుబలి-3’ కూడా ఉంటుందనే ప్రచారం జరిగింది గతంలో. కానీ అలాంటిదేమీ లేదని హీరో ప్రభాస్‌ స్పష్టం చేశాడు. అయితే ‘బాహుబలి’ ఇంకో రూపంలో సినీ అభిమానుల ముందుకు వచ్చే అవకాశం ఉందట. కామిక్‌ రూపంలోగానీ, యానిమేషన్‌లాగానీ టీవీ సిరీస్‌లాగానీ తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నారట.

ఇప్పటికే ‘బాహుబలి’ పేరుతో మొబైల్‌ గేమ్‌ కూడా ప్రిపేర్‌ చేస్తున్నట్లు సమాచారం ఉంది. ఇంతగా పాపులర్‌ అయిన సినిమా కాబట్టి, దీన్ని ఏ రూపంలో తీసుకొచ్చినా డిమాండ్‌ అలాగే ఉంటుంది. అయితే ఏం చేసినా, ఎలా చేసినా అది ఇంకో పెద్ద యజ్ఞమే అవుతుందనడం నిస్సందేహం. తొలి పార్ట్‌లో చూసిన పాత్రలే రెండో పార్ట్‌లో కూడా కొనసాగుతాయట. కానీ తొలి పార్ట్‌లో కేవలం పాత్రల పరిచయానికే అంత విజయం కట్టపెట్టారు ప్రేక్షక లోకం.

ఇక మలిభాగం విషయానికొస్తే తొలి భాగం కంటే పదింతలు గ్రిప్పింగ్‌గా ఉంటుందని ప్రభాస్‌ చెప్పాడు. సినిమా షూటింగ్‌ పార్ట్‌ మొత్తం కంప్లీట్‌ అయిపోయింది. రిలీజ్‌ డేట్‌ కూడా ఫిక్స్‌ చేసేశారు. ఇక చిత్ర యూనిట్‌ పబ్లిసిటీలో మునిగిపోయింది. అందులో భాగంగానే ఓ పక్క ప్రబాస్‌, మరో పక్క ఈ సినిమా సృష్టికర్త డైరెక్టర్‌ రాజమౌళి సినిమా షూటింగ్‌ అనుభవాలను మీడియా ముఖంగా అభిమానులతో పంచుకుంటున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular