HomeMovie News Teluguశ్రీ‌దేవి కూతురు.. హాట్ హాట్ ల‌వ్ స్టోరీ

శ్రీ‌దేవి కూతురు.. హాట్ హాట్ ల‌వ్ స్టోరీ

బాలీవుడ్‌లో ప్రేమ‌క‌థ‌లేం కొత్త కాదు.  అక్క‌డో పూట‌కో ప్రేమ క‌థ పుట్టుకొస్తుంటుంది.  తాజాగా శ్రీ‌దేవి కూతురు జాహ్న‌వి ప్రేమ‌లో ప‌డింద‌న్న హాట్ టాపిక్ బాలీవుడ్‌ని షేక్ చేస్తోంది. ఒక్క సినిమా కూడా చేయ‌క‌పోయినా… శ్రీ‌దేవి కూతుర‌న్న ట్యాగ్ లైన్‌లో సెల‌బ్రెటీ అయిపోయింది జాహ్న‌వి. చిట్టి పొట్టి డ్ర‌స్సుల‌తో పోటోల‌కు ఫోజులిస్తూ… మీడియాని ఆక‌ట్టుకొంటుంటుంది. తాజాగా జాహ్న‌వి ల‌వ్ స్టోరీ గురించి బాలీవుడ్ మీడియాలో ర‌క‌ర‌కాల క‌థ‌నాలు పుట్టుకొస్తున్నాయి. 

అక్ష‌త్ రాజ‌న్ అనే కుర్రాడితో జాహ్న‌వి ప్రేమ‌లో ప‌డింద‌ట‌. వీరిద్ద‌రూ క‌ల‌సి ఓ నైట్ క్ల‌బ్లులో డాన్సులు చేస్తూ దొరికిపోయారు. ఆ పార్టీకి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వీరి ప్రేమ‌వ్య‌వ‌హారం శ్రీ‌దేవికి తెలుస‌ని, ఆమె అండ చూసుకొనే జాహ్న‌వి ఇలా రెచ్చిపోతోంద‌ని తెలుస్తోంది. మ‌రి ఈ వార్త‌ల‌పై శ్రీ‌దేవి ఎలా స్పందిస్తుందో  చూడాలి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular