HomeMovie News Teluguఆ సినిమాకన్నా ఈ సినిమానే మిన్న

ఆ సినిమాకన్నా ఈ సినిమానే మిన్న

చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది ‘పెళ్ళి చూపులు’. చిన్న చిన్న నటీనటులతోనే సినిమాని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు. వెండితెరపై ఈ సినిమా సృష్టించిన సంచలనాలు చాలా ఎక్కువే. ప్రతీ ఒక్కరూ ఈ సినిమాని ప్రశంసలతో ముంచెత్తేశారు. తాజాగా బుల్లితెరపై ప్రసారమైన ఈ సినిమా, బుల్లితెరపైనా తన సత్తా చాటింది. నిన్న (ఆదివారం) ‘పెళ్ళి చూపులు’ సినిమా ఓ ఛానల్‌లో ప్రదర్శితమయ్యింది. మరో ఛానల్‌లో తమిళ హీరో సూర్య నటించిన ’24’ సినిమా వచ్చింది.

అయితే బుల్లితెర వీక్షకులు ఎక్కువగా ‘పెళ్ళిచూపులు’ వైపే మొగ్గు చూపారట. దానికి కారణం, ‘పెళ్ళిచూపులు’ సినిమాలో ఉన్న గ్రిప్పింగ్‌ కథనమే. చివరి వరకూ ఎంటర్‌టైనింగ్‌గా ఉండటం, యూత్‌ని కనెక్ట్‌ చేసే సినిమా కావడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా కట్టిపడేసే అంశాలు ఈ సినిమాలో మెండుగా ఉన్నాయి. చాలా సింపుల్‌గా యూత్‌కి కనెక్ట్‌ అయ్యే అంశాల్ని తెరపై ఆవిష్కరించడమే కాకుండా, అంతే సమానంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌ని కూడా కథలో మిళితం చేశాడు డైరెక్టర్‌.

అందుకే ఈ సినిమా ఇంత త్వరగా అందరికీ కనెక్ట్‌ అయ్యింది. ఎమోషన్స్‌ని ఎమోషనల్‌గా చెబితే కిక్కేముంది. దానికి ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడించి చెప్పాడు కాబట్టే, బోర్‌ కొట్టించకుండా తాను అనుకున్నది ఈజీగా చేరవేయగలిగాడు డైరెక్టర్‌. అన్నీ కలిసి ‘పెళ్ళిచూపులు’ సినిమాకి మంచి విజయాన్ని వెండితెరపైనా, బుల్లితెరపైనా అందించాయని చెప్పవచ్చు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular