HomeMovie News Teluguసల్మాన్‌ఖాన్‌ అంత చీప్‌ నటుడా?

సల్మాన్‌ఖాన్‌ అంత చీప్‌ నటుడా?

సల్మాన్‌ ఖాన్‌ స్టయిల్‌ ఐకాన్‌. మాస్‌ ఇమేజ్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌ ఆయన. మాస్‌ సినిమాలతో మెప్పించడంలో సల్మాన్‌ఖాన్‌కి ఈ తరంలో సాటి వచ్చే నటుడు ఎవరట? ఈ మధ్యకాలంలో వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు ఈ కండల హీరో. సల్మాన్‌ఖాన్‌తో సినిమా చేసే ఛాన్స్‌ అంటే ఏ హీరోయిన్‌ అయినా ఎగిరి గంతెయ్యాలి. కానీ ఓ హీరోయిన్‌ సల్మాన్‌ఖాన్‌ని చీప్‌ నటుడని విమర్శించింది. అతనికసలు స్టయిల్‌ కూడా తెలియదట.

ఈ మాట బాలీవుడ్‌ హీరోయిన్‌ ఎవరన్నా అంటే బాక్స్‌ బద్దలైపోతుంది. కానీ విమర్శలు చేసింది పాకిస్తానీ నటి. ‘హిందీ మీడియం’ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌కి వచ్చిన పాకిస్తానీ నటి సబా కమర్‌, సల్మాన్‌ఖాన్‌ మీదనే కాకుండా ఇంకో బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మి కూడా విమర్శలు చేసింది అతనితో కలిసి నటించమని ఎవరైనా అడిగితే ఒప్పుకోనని చెప్పింది. ఇమ్రాన్‌ హష్మీని ముద్దు పెట్టుకుంటే నోటి క్యాన్సర్‌ వస్తుందని కూడా విపరీత వ్యాఖ్యలు చేసింది సబా కమర్‌.

అయితే ఇమ్రాన్‌ హష్మీతోగానీ సల్మాన్‌ఖాన్‌తోగానీ నటించేంత సీన్‌ సబా కమర్‌కి లేదు. ఈ వ్యాఖ్యలతో పాపులారిటీ పెంచుకోవాలని ఆమె ఆశిస్తుండవచ్చు. ఎంతైనా పాకిస్తాన్‌ కదా, ఆ పైత్యం ఉంటుంది. ఆ పైత్యమే ఇలా సబా కమర్‌తో బాలీవుడ్‌ నటులపై విపరీత వ్యాఖ్యలు చేసేలా చేసింది. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular