HomeMovie News Teluguసూపర్‌ స్టార్‌ 48 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం

సూపర్‌ స్టార్‌ 48 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ 48 ఏట అడుగు పెట్టారు. అదేంటి? ఎప్పుడో అమితాబ్‌ అర్థ సెంచరీ దాటేసి, ఆరు పదులు కూడా క్రాస్‌ చేసేశారు కదా? అని డౌటు పడొద్దు. నటుడిగా అమితాబ్‌ బచ్చన్‌కి 48 ఏళ్ళు. తొలి సినిమా ‘సాథ్‌ హిందూస్తానీ’ నుంచి ఇప్పటిదాకా ఆయన 48 సుదీర్ఘ నటనా జీవితాన్ని అత్యద్భుతంగా మలచుకున్నారు.

ఇంకా ఇంకా ఆయన ప్రయాణం అద్భుతంగానే కొనసాగుతోంది. వయసుకు తగ్గ పాత్రల్ని ఎంచుకుంటూ తాను నటించే సినిమాలకు తన స్టార్‌డమ్‌ని కిరీటంలా అద్దుతున్న ఘనత కేవలం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అమితాబ్‌ బచ్చన్‌కి మాత్రమే చెల్లుతుంది. విలక్షణమైన పాత్రల్ని ఎంచుకోవడం అమితాబ్‌ బచ్చన్‌ ప్రత్యేకత. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఎందరో తన స్టార్‌డమ్‌కి సహకరించారని పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు అమితాబ్‌ బచ్చన్‌.

ప్రాణం పోయేదాకా నటుడిగా తన ప్రస్తానం కొనసాగుతుందని చెబుతుంటారాయన. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అమితాబ్‌ బచ్చన్‌ సూపర్‌ స్టార్‌. ఆయన పోషించినన్ని విలక్షణ పాత్రలు బహుశా భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే ఇంకెవరూ పోషించి ఉండరేమో. సినిమాల్లో బిజీగా ఉండడం, సోషల్‌ మీడియాలో అభిమానులతో ఇంటరాక్ట్‌ అవడం ఒకటేమిటి పలు రకాల వ్యాపకాలతో అమితాబ్‌ నిత్య శ్రామికుడు అనిపించుకుంటూనే ఉన్నాడు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular