HomeMovie News Teluguనాగ్‌ లెక్కలు ఈ సారి తప్పవట

నాగ్‌ లెక్కలు ఈ సారి తప్పవట

నాగార్జున తనయుడు అఖిల్‌ హీరోగా పరిచయమైన చిత్రం ‘అఖిల్‌’ తర్వాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్నాడు. ఈ గ్యాప్‌లో చాలా మేకోవర్‌ అయ్యాడు అఖిల్‌. విక్రమ్‌ కుమార్‌ డైరెక్షన్‌లో అఖిల్‌ సినిమా ఓకే అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదికి వెళ్లనుంది. ఈ సినిమాని మొదట్లో క్లాస్‌ సినిమాగా తెరకెక్కించాలని అనుకున్నారట. అయితే చిన్న ఛేంజ్‌. అఖిల్‌ని నాగార్జున మాస్‌ హీరోగానే చూడాలనుకుంటున్నాడట. అందుకే కథలో చాలా మార్పులు చేసి మాస్‌ స్టోరీగా తెరకెక్కించాలని అనుకుంటున్నారట.

అందుకోసం హాలీవుడ్‌ ప్రముఖు స్టంట్‌ మాస్టర్స్‌ని కూడా దించుతున్నారు. ఈ సినిమాకి నాగార్జునే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా విషయంలో నాగ్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. దగ్గరుండి తానే అన్ని విషయాలు చూసుకోనున్నారట. అయితే నాగార్జున తనయుడు నాగచైతన్య కూడా మొదట్లో క్లాస్‌ హీరోగానే పేరు తెచ్చుకున్నాడు. కానీ మధ్యలో మాస్‌ మేకప్‌ ట్రై చేసి రేస్‌లో వెనకబడ్డాడు. తర్వాత తనకి మాస్‌ పడదనుకుని తెలుసుకుని, క్లాస్‌కే పరిమితం అయ్యాడు. సక్సెస్‌ చూస్తున్నాడు.

మరి అదే బాటలో అఖిల్‌ని కూడా నడిపించాలనుకుంటున్నాడు నాగార్జున. మరి ఎంత వరకూ సక్సెస్‌ అవుతాడో చూడాలి. అయితే ఈ సారి అఖిల్‌ సినిమాకి మాత్రం నాగ్‌ కమర్షియల్‌ లెక్కలు పక్కాగా వేసి బరిలో దించుతున్నాడట. దాంతో ఈ సారి రాబోయే అఖిల్‌ సినిమాపై నాగార్జున ఫుల్‌ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడనీ తెలియవస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular