HomeMovie News Teluguఅప్పుడు బాలయ్య, ఇప్పుడు మెగాస్టార్‌

అప్పుడు బాలయ్య, ఇప్పుడు మెగాస్టార్‌

మంచు మనోజ్‌ సినిమా ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’ సినిమాలో బాలకృష్ణ అతిథి పాత్రో కన్పించారు. ఆ సినిమాకి ఆయనే హైలైట్‌. ఆ ఆహార్యం, ఆ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ అద్భుతం అన్పించేలా ఆ సినిమాకి హెల్పయ్యారాయన. అలా మంచు మనోజ్‌ ఎప్పుడో బాలయ్య అభిమానుల మనసుల్ని దోచేశాడు. మనోజ్‌ తండ్రి మోహన్‌బాబుకీ, నందమూరి ప్యామిలీకీ ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలుసు.

ఇప్పుడు మనోజ్‌ ‘గుంటూరోడు’ సినిమాతో మెగా అభిమానుల్ని కూడా తనవైపుకు తిప్పుకున్నాడు. ఈ సినిమాకి చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్‌ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. చిరంజీవికీ, మోహన్‌బాబుకీ మధ్య కూడా ఎంతో స్నేహం ఉంది. ఇలా ఓ హీరో సినిమాకి అన్ని వైపుల నుంచీ మద్దతొస్తే ఓపెనింగ్స్‌ అదిరిపోతాయనడం నిస్సందేహం.

రేపు విడుదలవుతున్న మూడు సినిమాల్లోనూ మాస్‌ పల్స్‌ని పట్టే సినిమాగా ‘గుంటూరోడు’ గురించే చెప్పుకుంటున్నారు. మహా మాస్‌, వీరమాస్‌ అనేలా ఈ సినిమా రూపొందింది. మనోజ్‌ ఈ సినిమా కోసం పడ్డ కష్టం, సినిమా ప్రోమోస్‌లోనే స్పష్టంగా కన్పిస్తోంది. మనోజ్‌ సరసన ‘గుంటూరోడు’ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటించింది. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular