HomeMovie News Telugu'దువ్వాడ' సంచలనాలకు ఆకాశమే హద్దు

‘దువ్వాడ’ సంచలనాలకు ఆకాశమే హద్దు

అల్లు అర్జున్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ రూపొందిస్తున్న ‘డిజె’ సినిమా టీజర్‌ ఈ మధ్యనే విడుదలై సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ మధ్య సోషల్‌ మీడియాలో సృష్టించే సంచలనాలే ఆయా సినిమాలపై హైప్‌ ఇంకా పెరగడానికీ, భారీ ఓపెనింగ్స్‌ రావడానికీ కారణమవుతున్నాయి. అలా సోషల్‌ మీడియాలో లెక్కలూ రికార్డుల పరంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ‘డిజె – దువ్వాడ జగన్నాథమ్‌’ సినిమా టీజర్‌కి 57 లక్షల వ్యూస్‌ మాత్రమే కాకుండా, లక్షకి పైగా లైక్స్‌ కూడా వచ్చాయి.

ఇది అల్లు అర్జున్‌ కెరీర్‌లో బెస్ట్‌ రికార్డ్‌గా చెప్పవచ్చు. ఇదే తరహాలో ‘డిజె’ వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’, ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’ చిత్రాలతో మంచి జోరుమీదున్న బన్నీ, ఈసారి 100 కోట్ల టార్గెట్‌తో ‘దువ్వాడ జగన్నాథమ్‌’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ దూకుడుకి సోషల్‌ మీడియాలో టీజర్‌ సృష్టిస్తున్న సంచలనాలు తోడయ్యాయని అనుకోవాలి. అరకోటి మార్క్‌ని ఈజీగా దాటేసిన ‘దువ్వాడ జగన్నాథమ్‌’ టీజర్‌ అతి త్వరలో కోటి దాటేస్తుందని అంచనా వేస్తున్నారు.

అతి త్వరలో ఇంకో టీజర్‌ రాబోతోంది. అది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. పవన్‌కళ్యాణ్‌తో ‘గబ్బర్‌సింగ్‌’ లాంటి విజయాన్ని అందుకున్న హరీష్‌ శంకర్‌ ఆ స్థాయి విజయాన్ని అల్లు అర్జున్‌కి ‘దువ్వాడ జగన్నాథమ్‌’తో ఇవ్వబోతున్నాడట. హాట్‌ బ్యూటీ పూజా హెగ్దే గ్లామర్‌ ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ కానుంది. ఇంతకుముందెన్నడూ లేనంత హాట్‌గా కనిపించబోతోందట పూజా హెగ్దే ఈ సినిమాలో. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రానికి దిల్‌ రాజు నిర్మాత.

You May Like This
- Advertisment -spot_img

Most Popular