HomeMovie News Teluguకుర్రాడు అదరగొట్టేస్తున్నాడు

కుర్రాడు అదరగొట్టేస్తున్నాడు

‘పెళ్ళిచూపులు’ ఫేం యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. యూ ట్యూబ్‌లో విజయ్‌ దేవరకొండ తాజా చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’ ట్రైలర్‌ ట్రెండింగ్‌గా ఉంది. ఫిబ్రవరి 14న ట్రైలర్‌ విడుదల కాగా, రెండ్రోజుల్లోనే లక్ష వ్యూస్‌ దాటేసింది. వ్యూస్‌ పరంగా, లైక్స్‌ పరంగా, షేరింగ్స్‌ పరంగా చూసుకుంటే చిన్న చిత్రాల్లో ఇదొక పెద్ద చిత్రం అనే భావన కలగకమానదు. సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ‘అర్జున్‌రెడ్డి’ సినిమా గురించే చర్చించుకుంటున్నారు.

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో హీరో నాని స్నేహితుడిగా కనిపించిన విజయ్‌ దేవరకొండకి ‘పెళ్ళిచూపులు’ సినిమా చాలా పెద్ద బ్రేక్‌ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత విజయ్‌ చాలా చాలా బిజీ అయిపోయాడు. వరుస అవకాశాలు వస్తుండడంతో వాటిల్లోంచి ఎంపిక చేసుకుని మంచి చిత్రాలు చేసేందుకు ఛాన్స్‌ దక్కుతోంది. ఇక్కడే ఇంకా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉందంటాడు యంగ్‌ హీరో విజయ్‌. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా కెరీర్‌ని ఇంకా జాగ్రత్తగా బిల్డప్‌ చేసుకుంటానని విజయ్‌ చెబుతున్నాడు.

విజయ్‌ సరసన ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో షాలిని హీరోయిన్‌గా నటించింది. భద్రకాళి పిక్చర్స్‌ పతాకంపై వంగ ప్రణయ్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంగ సందీప్‌రెడ్డి దర్శకుడు. చిన్న సినిమాలు అనూహ్యంగా పెద్ద విజయాల్ని అందుకున్న సందర్భాల్ని ఇటీవలి కాలంలో ఎన్నో చూశాం. ఆ కోవలో ‘అర్జున్‌రెడ్డి’ కూడా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షిద్దాం.

You May Like This
- Advertisment -spot_img

Most Popular