HomeMovie News Teluguరవితేజా నువ్వు కేక!

రవితేజా నువ్వు కేక!

కొంచెం గ్యాప్‌ తీసుకున్నాడుగానీ బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు అల్టిమేట్‌ సినిమాల్ని ప్రారంభించేశాడు రవితేజ. ‘టచ్‌ చేసి చూడు’ ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమవగా, ‘రాజా ది గ్రేట్‌’ సినిమా తాజాగా ప్రారంభమయ్యింది. రెండూ సూపర్బ్‌ కాంబినేషన్స్‌ అని చెప్పక తప్పదు. ‘రాజా ది గ్రేట్‌’ సినిమాలో రవితేజ సరసన మెహరీన్‌ కౌర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘టచ్‌ చేసి చూడు’ సినిమా కోసం రాశి ఖన్నా పేరు ఖరారయ్యింది. ‘రాజా ది గ్రేట్‌’, ‘టచ్‌ చేసి చూడు’ ఈ రెండు చిత్రాలూ డిఫరెంట్‌ కథాంశంతో, మాస్‌ మహరాజ్‌ రవితేజ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటాయట.

మాస్‌లో బీభత్సమైన ఫాలోయింగ్‌ ఉన్న రవితేజ, ‘టచ్‌ చేసి చూడు’, ‘రాజా ది గ్రేట్‌’ చిత్రాలతో మాస్‌ ఆడియన్స్‌ని అలరించడంతోపాటు, క్లాస్‌ ఆడియన్స్‌ని కూడా టచ్‌ చేస్తానంటున్నాడు. గ్యాప్‌ తీసుకున్నదెందుకో తెలియలేదుగానీ, ఇండస్ట్రీలో వినవస్తున్న టాక్‌ ప్రకారం చూస్తే, ఈ గ్యాప్‌లో రవితేజ తన ఫిజిక్‌ మీద దృష్టిపెట్డంతోపాటుగా, మేకోవర్‌ కూడా ట్రై చేశాడనీ, రానున్న సినిమాల్లో రవితేజ చాలా కొత్తగా కనిపించనున్నాడని తెలియవస్తోంది.

ఈ రెండు సినిమాల్నీ ఈ ఏడాదే తీసుకొచ్చేస్తాడట. అది కూడా చాలా తక్కువ గ్యాప్‌లోనేనని సమాచారమ్‌. మూడో సినిమాని తీసుకొచ్చేయడానికి కూడా రవితేజ సన్నాహాలు చేస్తున్నాడని తెలియవస్తోంది. ఆ మూడో సినిమా కూడా అతి త్వరలోనే ప్రారంభమవుతుందట. ఏడాదికి మూడు సినిమాల్ని తీసుకొస్తే రవితేజా నువ్వు కేక అనాల్సిందే. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular