HomeMovie News Teluguరకుల్‌ రిస్క్‌ చేస్తోందా?

రకుల్‌ రిస్క్‌ చేస్తోందా?

టాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా చెలామణీ అవుతోంది ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. గ్లామర్‌తో పాటు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా రకుల్‌కి దక్కుతున్నాయి. అందుకే కొందరు డైరెక్టర్లు హీరోయిన్‌ ప్రాధాన్యత ఉన్న స్టోరీలతో రకుల్‌ చెంతకు వెళ్తున్నారట. రకుల్‌కి ఓ అలవాటు ఉంది. ఆమెకు స్టోరీలు వినడం అంటే చాలా ఇష్టం అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అలా విన్న స్టోరీల్లో ఏ స్టోరీ తనకు నచ్చినా, హీరో ఎవరు, డైరెక్టర్‌ ఎవరు అనేది కూడా ఆలోచించదట ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

అందుకే అమ్మడు ఖాళీ లేకుండా సినిమాలు చేసేస్తూ ఉంటుందట. అయితే తాజాగా రకుల్‌ విన్న స్టోరీల్లో ఓ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ ఉందట. ప్రస్తుతం హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలకు బాగా క్రేజ ఉంది. ఓ మోస్తరు ఇమేజ్‌ ఉన్న హీరోయిన్లు కూడా ఈ తరహా సినిమాలకు సై అంటున్నారు. అలాంటిది రకుల్‌ తన ఇమేజ్‌తో ఇలాంటి సినిమాల్లో నటిస్తే ఆ సినిమా నిర్మాతలకు కాసుల పంట పండడం ఖాయం అంటున్నారు.

అయితే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాల్ని ఇప్పుడప్పుడే చేయనని రకుల్‌ గతంలో చెప్పింది. ఇంకా నాకు ఆ తరహా పాత్రల్ని పోషించేంత అనుభవం రాలేదంది. అయితే తాజాగా ఓ ప్రముఖ డైరెక్టర్‌ హీరోయిన్‌ సెంట్రిక్‌ స్టోరీ లైన్‌ వినిపించాడట. ఆ స్టోరీ పట్ల రకుల్‌ పోజిటివ్‌గా ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అంటే రకుల్‌ మనసు మార్చుకుందా? రకుల్‌ ప్రధాన పాత్రలో సినిమా రాబోతోందా? ఏమో చూడాలి. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular